ఇరాన్ సరిహద్దులో 295 కిమీ మేర గోడను నిర్మిస్తున్న టర్కీ.. వీడియో
తాలిబన్ల దురాక్రమణ అనంతరం అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో ఆ దేశ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
తాలిబన్ల దురాక్రమణ అనంతరం అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో ఆ దేశ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రోడ్డు, వాయు మార్గాలను దిగ్భంధించినప్పటికీ సామాన్య పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి బయటపడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్ నుంచి ఇరాన్ మీదుగా తమ దేశంలోకి వచ్చే అక్రమ చొరబాటుదారులను అడ్డుకునేందుకు టర్కీ దేశం ఓ భారీ గోడను నిర్మిస్తోంది. ఇరాన్ సరిహద్దులో 295 కిమీ మేర గోడను నిర్మిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ తాజాగా వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..
Shreyas Iyer – IPL 2021: అయ్యారే.. అయ్యర్ షాట్ అదిరిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..!