అమెరికా యుద్ధనౌకలు పశ్చిమాసియాలోకి ఇరాన్‌తో యుద్ధం తప్పదా

Updated on: Jan 31, 2026 | 11:02 AM

ట్రంప్ ఇరాన్‌కు అణ్వాయుధ ఒప్పందంపై అల్టిమేటం జారీ చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా యుద్ధనౌకలు గల్ఫ్‌లోకి ప్రవేశించాయి. ఇరాన్‌లో అంతర్గత నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నేత అలీ లారిజానీ కుమార్తెను ఎమోరీ యూనివర్సిటీ తొలగించింది, ఇది సంక్షోభాన్ని మరింత పెంచింది.

ట్రంప్ బెదిరింపులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. ఇలాంటి తరుణంలో అమెరికా యుద్ధనౌకలు గల్ఫ్ లోకి ప్రవేశించాయి. సమయం మించిపోతోందని, అణుయేతర ఒప్పందంపై చర్చలకు సిద్ధం కావాలని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఏం జరగుతుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మూడు యుద్ధనౌకలతో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియాకు చేరుకుంది. ఈ సమయంలో ట్రంప్ బెదిరింపులకు దిగారు. సమయం చాలా ముఖ్యమైందని, అణ్వాయుధాలపై న్యాయమైన, సమానమైన ఒప్పందం కోసం ఇరాన్ వెంటనే చర్చలకు సిద్ధం కావాలని కోరారు. సుప్రీం లీడర్‌ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజా నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఘర్షణల్లో ఇప్పటికే కొన్ని వేల మంది మృతి చెందారు. అయితే అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ కుమార్తె డాక్టర్ ఫాతిమాను విధుల్లో నుంచి తొలగించింది. ఈ యూనివర్సిటీకి చెందిన మెడికల్ స్కూల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఫాతిమా పనిచేస్తోంది. ఆమె తండ్రి ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీకి సీనియర్ సలహాదారుడిగా ఉన్నారు. ఇరాన్‌లో జరుగుతున్న ప్రజా నిసనలపై భద్రతా దళాలు కఠినంగా వ్యవహరించడంలో అలీ లారిజానీ పాత్ర ఉందని అమెరికా ట్రెజరీ విభాగం అత‌డిపై ఆంక్షలు విధించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Black Egg: నల్ల కోడి గుడ్డు తిన్నారా ?? తింటే ఆయుష్షు పెరుగుతుందట

తల్లిదండ్రుల హత్య కేసులో కూతురు సురేఖ అరెస్ట్

బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. KCR రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసిన SIT

చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?