హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో

Updated on: Dec 26, 2025 | 10:47 AM

అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు కీలకమైన H-1B వీసా ఎంపిక ప్రక్రియలో ట్రంప్ సర్కార్‌ భారీ మార్పులు చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న లాటరీ విధానానికి స్వస్తి చెబుతూ, అధిక నైపుణ్యాలు, ఎక్కువ జీతాలు పొందే వారికి ప్రాధాన్యత ఇచ్చే కొత్త వెయిటెడ్ విధానాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలను కాపాడటానికేనని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్ల కన్నా తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులను తీసుకురావడానికి ఈ విధానాన్ని కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా హెచ్‌-1బీ వీసాల జారీకి అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అనుసరిస్తున్న లాటరీ విధానంలో.. ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగాగానీ.. జీతం ఆధారంగాగానీ ఎవరికీ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వరు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకుని కంప్యూటరైజ్డ్‌ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైనవారు అమెరికాకు వచ్చేవారు. కానీ.. కొత్త విధానంలో ‘వెయిటెడ్‌ సెలక్షన్‌’ పద్ధతిని అనుసరిస్తారు. అంటే.. ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతం అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం.. ఎంపిక ప్రక్రియలో ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో