ట్రంప్‌ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Updated on: Sep 19, 2025 | 9:03 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్లైట్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. యూకే పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ సమీపంలోకి మరో ప్రయాణికుల విమానం దూసుకొచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన పైలెట్లు తమ దిశను మార్చుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఈ ఘటన లాంగ్‌ ఐలాండ్‌ గగనతలంలో చోటు చేసుకుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి, ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్‌ యూకే పర్యటనకు వెళ్లారు. ట్రంప్‌ దంపతులు ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానం లాంగ్‌ ఐలాండ్‌ వద్ద గగనతలంలో ఉన్నప్పుడు స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం అతి సమీపంలోకి వచ్చింది. ఇది గమనించిన న్యూయార్క్‌ టవర్‌ కంట్రోలర్‌ సిబ్బంది స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌కు హెచ్చరికలు పంపారు. విమానాన్ని కుడివైపుకు మళ్లించాలంటూ హెచ్చరించారు. పలుమార్లు హెచ్చరించినా పైలట్లు పట్టించుకోలేదు. దీనిపై టవర్‌ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శ్రద్ధ వహించండి.. ఐప్యాడ్‌ నుంచి బయటకిరండి..’ అంటూ పైలట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన పైలట్లు విమాన దిశను మార్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనపై స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. ఆ సమయంలో తమ ఎయిర్‌బస్‌ A321 స్పిరిట్‌ ఫ్లైట్‌ లాంగ్‌ ఐలాండ్‌ మీదుగా ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ నుంచి బోస్టన్‌కు వెళ్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఇచ్చిన అన్ని ఆదేశాలను పాటించినట్లు చెప్పింది. అనంతరం సేఫ్‌గా గమ్యస్థానానికి చేరుకున్నట్లు వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల డిసెంబర్‌ కోటా టిక్కెట్లు విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇప్పట్లో ఆగేలా లేదుగా

కంట్లో కారం కొట్టి 6 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన మహిళ

ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కార్

తిరుపతి జిల్లా చియ్యవరంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన