Donald Trump: ట్రంప్‌ దూకుడు.. ఆ ఉద్యోగులందరికీ లే ఆఫ్‌లు..

Updated on: Jan 23, 2025 | 5:03 PM

అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్‌ ట్రంప్‌... పాలనలో దూకుడు పెంచారు. ఇప్పటికే గత అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేస్తూ డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్‌ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బంది అందరికీ లేఆఫ్‌ లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని ఆదేశిస్తూ ట్రంప్‌ కార్యవర్గం ఓ మెమో జారీ చేసింది. అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేస్తూ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే సిబ్బంది నిర్వహణ కార్యాలయం మెమో విడుదల చేసింది. దాని ప్రకారం.. డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బంది అందరినీ బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్‌ పేజీలను కూడా ఈ గడువులోగా తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. డీఈఐ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచించారు. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను తొలగించారు. వచ్చే శుక్రవారం నాటికి వీరికి లేఆఫ్‌లు ఇచ్చి ఫెడరల్‌ సిబ్బంది సంఖ్యలో కోత విధించాలని ట్రంప్‌ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోతపై నూతన అధ్యక్షుడి యంత్రాంగం నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు. ఈ నిర్ణయం ఎంతమందిపై ప్రభావం చూపనుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రెండ్ ఫ్రెండే.. బిజినెస్ బిజినెస్సే.. ఇండియాతోనూ ట్రంప్ ట్రేడ్ వార్ ??

Hyderabad: హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ కలకలం

తెలంగాణలో రేషన్‌ కార్డు దారులకు అలర్ట్..

Rashmika Mandanna: అయ్యో.. రష్మికకు ఏమైంది? వీల్‌ ఛైర్‌లో ఇలా..

పుష్ప-2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్‌