గల్ఫ్‌ దేశాలకు క్యూ కడుతున్న కోటీశ్వరులు! కారణమేంటంటే..

Updated on: May 27, 2025 | 4:19 PM

ప్రపంచంలోని కుబేరులకు మిడిల్ ఈస్ట్ ఇప్పుడు హాట్ డెస్టినేషన్‌గా మారుతోంది. ఒకప్పుడు సంపన్నులు పెట్టుబడులకు అమెరికా, యూరప్ దేశాల వైపు చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పన్నులు దాదాపు లేకపోవడం, అత్యాధునిక సౌకర్యాలు, తక్కువ నేరాలు వంటి కారణాలతో మిడిల్ ఈస్ట్‌ను తమ సెకండ్ హోమ్‌గా ఎంచుకుంటున్నారు.

అక్కడ నివసిస్తున్న సంపన్నుల సంఖ్య దాదాపు 1,34,000. దుబాయ్ రికార్డు స్థాయిలో ఒక్క 2024లో 10 మిలియన్ డాలర్ల కంటే అధిక విలువైన 435 లగ్జరీ ప్రాపర్టీ అమ్మకాలను నమోదు చేసింది. 2025 సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే మరో 111 అమ్మకాలు జరిగాయి. దుబాయ్ తో పాటు సౌదీ అరేబియా ఇప్పుడు సంపన్నుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ముస్లిం సంపన్నులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఖతర్, బహ్రెయిన్, ఒమన్ కూడా ఇదే బాటలో దూసుకుపోతున్నాయి. గల్ఫ్ దేశాలు అందిస్తున్న గోల్డెన్ వీసాలు ఇతర ప్రోత్సాహకాలు ఈ ట్రెండ్‌ను మరింత పెంచుతున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్… సంపన్నులకు గ్లోబల్ హబ్‌గా మారుతోంది. ఇక్కడ సంపన్నులు నివాసం పెట్టుబడులతో మంచి అవకాశాలను అందుకుంటున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ‘గోల్డ్ కార్డ్’ ప్రోగ్రామ్‌కు గల్ఫ్‌ దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అమెరికన్ గోల్డెన్ వీసా కోసం దాదాపు 5 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఈ దేశాల సంపన్నులకు ఆకర్షణీయమైన ఆఫర్లతో గోల్డ్‌ కార్డ్‌ ఇస్తున్నాయి. ఇంతకీ ఈ గోల్డెన్‌ వీసా ఏంటి.? అసలు ఈ వీసా వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం. సాధారణంగా వీసా పొందాలంటే స్పాన్సర్‌ లేదా యజమాని అవసరం ఉంటుంది. అయితే గోల్డెన్‌ వీసా ఉంటే అలాంటి అవసరం ఉండదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్ ఉన్న ఆ 30 నిమిషాలు థియేటర్లో రచ్చ రచ్చే..

శ్రీలీల,రష్మిక ఉందిగా.. మళ్లీ తమన్నాను ఎందుకు? ఇచ్చిపడేసిన హీరోయిన్

నా తొలి ముద్దు.. జీవితమంతా గుర్తు పెట్టుకుంటా..

గుడ్‌ న్యూస్.. రెట్రో OTT రిలీజ్‌ డేట్ వచ్చేసింది

అమరన్ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..! ఏం చేద్దాం.. విధి!