Elon Musk: ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్‌..

|

Nov 26, 2024 | 10:25 AM

ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ అమెరికలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి చేపట్టిన ప్రయోగంలో అనూహ్య ఘటన జరిగింది. సూపర్‌ హెవీ బూస్టర్‌ రాకెట్‌ ఒక్కసారిగా పేలిపోయింది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ప్రయోగాన్ని వీక్షిస్తుండగా సాఫ్ట్‌ ల్యాండ్‌ అయిన క్షణాల్లోనే ఈ పరిణామం జరగడం అందర్ని షాక్‌కి గురి చేసింది. బుధవారం ఉదయం సౌత్‌ టెక్సాస్‌ ‘స్టార్‌బేస్‌’ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌ ఈ ప్రయోగం నిర్వహించింది.

రాకెట్‌ గాల్లోకి దూసుకెళ్లడం, అప్పర్‌ స్టేజ్‌ నుంచి స్టార్‌షిప్‌ సెపరేషన్‌ లాంటి ప్రక్రియలు విజయవంతంగానే జరిగాయి. కానీ లాంచ్‌ప్యాడ్‌కు తిరిగి రావడానికి బదులుగా ఆ భారీ రాకెట్‌ పేలిపోయింది. తిరిగి ల్యాండ్‌ అయ్యే టైమ్‌లో గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో తీరంలో ఒక్కసారిగా పేలిపోయి సముద్రంలో శకలాలు పడ్డాయి. అయినా .. ఈ భారీ రాకెట్‌ మాత్రం కీలక మైలురాయిని అధిగమించిందని స్పేస్‌ఎక్స్‌ ప్రకటించుకుంది. తాము అనుకున్నట్లే స్టార్‌షిప్‌ అప్పర్‌ స్టేజ్‌ నుంచి విడిపోయిందని, 65 నిమిషాల తర్వాత ఫసిఫిక్‌ మహాసముద్రంలో దిగిందని తెలిపింది. కాగా, ఈ జెయింట్‌ రాకెట్‌తో ఆరుసార్లు ప్రయోగం నిర్వహించగా.. స్టార్‌షిప్‌ వెహికిల్‌ సురక్షితంగా ల్యాండ్‌ కావడం ఇది రెండోసారి. గత నెల స్పేస్‌ఎక్స్‌ సంస్థ భారీ స్టార్‌షిప్‌ రాకెట్‌ బూస్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆ స్టార్‌షిప్‌ నింగిలోకి దూసుకెళ్లడంతో పాటు లాంచ్‌ప్యాడ్‌ సురక్షితంగా చేరుకుంది. దీంతో ఇది ఓ ఇంజినీరింగ్‌ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయంలో మస్క్‌ కీలకపాత్ర పోషించారు. ఈ దోస్తీ కారణంగా మస్క్‌కు ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు ట్రంప్‌. అందుకే ఇవాళ స్వయంగా.. దాదాపు 400 అడుగుల ఎత్తైన రాకెట్ ప్రయోగాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ వీక్షించారు. ఈ ప్రయోగానికి ముందు తాను స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగం వీక్షించేందుకు వెళ్తున్నట్లు ట్రంప్‌ సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ‘నేను గ్రేట్‌ స్టేట్‌ ఆఫ్‌ టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్‌ ప్రయోగాన్ని చూడటానికి వెళుతున్నాను. మస్క్‌కు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాసుకొచ్చారు. ఈ ప్రయోగాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌తో సహా పలువురు రిపబ్లికన్‌ నాయకులు ప్రత్యక్షంగా వీక్షించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.