South Koreans: ఒకటి, రెండేళ్లు తగ్గిపోనున్న సౌత్ కొరియన్ల వయసు.. ఏం చేశారంటే..!
దక్షిణ కొరియా పౌరుల వయసు ఒకటి, రెండేళ్లు తగ్గిపోనుంది.. వయసు తగ్గిపోవడం ఏంటి ఏదేదో వింత అనుకునేరు. అక్కడ వయసు లెక్కింపును ప్రమాణీకరించే..
దక్షిణ కొరియా పౌరుల వయసు ఒకటి, రెండేళ్లు తగ్గిపోనుంది.. వయసు తగ్గిపోవడం ఏంటి ఏదేదో వింత అనుకునేరు. అక్కడ వయసు లెక్కింపును ప్రమాణీకరించే కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దక్షిణ కొరియాలో వయసు లెక్కింపునకు మూడు విధానాలు అమల్లో ఉన్నాయి. అంతర్జాతీయ వయసు, కొరియన్ వయసు, క్యాలెండర్ వయసు.. ఒక్కొక్కరికీ మూడు వయసులు ఉండటం అక్కడ సర్వసాధారణం. ఈ గందరగోళానికి ముగింపు పలకాలని ఆ దేశ పార్లమెంట్ ఇటీవల ప్రత్యేక చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జూన్ నుంచి అంతర్జాతీయ వయసునే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం పుట్టినప్పుడు శిశువు వయసు ‘సున్నా’నుంచి మొదలవుతుంది. ఆపై.. వచ్చే ఏడాది అదే తేదీకి ఒకటి చొప్పున లెక్కిస్తారు. ప్రపంచంలోని చాలావరకు దేశాలు ఇదే వ్యవస్థను అనుసరిస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు కొరియన్లు చాలా మంది అంతర్జాతీయ వయసు కంటే ఒకటి, రెండేళ్లు ఎక్కువే చెబుతారు. ఎందుకంటే అక్కడ పుట్టగానే ఒక ఏడాది వయసుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రతి జనవరి 1న ఒక్కో సంవత్సరం కలుపుతారు. కాగా, పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం అన్ని న్యాయ, పరిపాలనా వ్యవహారాల్లో అంతర్జాతీయ వయసును ప్రామాణికంగా తీసుకోనున్నారు. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలూ, పౌరులను ఇదే విధానం పాటించేలా ప్రోత్సహించాలని సూచించింది. ఈ సవరణ అనవసరమైన సామాజిక-ఆర్థిక వ్యయాలను తగ్గించడానికి ఉద్దేశించిందని ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..