ATA Celebrations 2022: ఆటా మహాసభల్లో సెలబ్రిటీల సందడి.. గోల్ఫ్‌ ఆడిన సద్గురు, రకుల్‌, కపిల్‌..

|

Jul 04, 2022 | 11:08 AM

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్‌ డీసీలోని సువిశాలమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్


అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్‌ డీసీలోని సువిశాలమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 1, 2, 3 తేదీల్లో సభలు జరుగుతున్నాయి. ఈ మెగా కన్వెన్షన్‌ కోసం అతిరథ మహారథులు తరలివస్తున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనడానికి ఇండియా నుండి అమెరికా చేరుకుంటున్న ప్రత్యేక అతిథులతో వాషింగ్టన్ డీసీ కళకళలాడుతుంది. సద్గురు జగ్గీ వాసుదేవ్, మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, క్రిస్ గేల్, హీరో అడవి శేష్, నటి రకుల్ ప్రీత్ సింగ్‌, తదితరులు ఇప్పటికే వాషింగ్టన్‌ చేరుకున్నారు.వీరితో పాటు టీఆర్‌ఎస్‌ మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మల్లారెడ్డి తదితర రాజకీయ నాయకులు అమెరికా చేరుకున్నారు. వీరికి ఆటా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆటా ఉత్సవాల్లో భాగంగా సద్గురు జగ్గీ వాసుదేవ్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రకుల్ ప్రీత్ తదితరులు గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. కాగా కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ యూత్ క్రికెట్ టోర్నమెంట్‌కు అథిథులుగా హాజరవుతున్నారు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 04, 2022 08:46 AM