నా జీవితాన్ని నాశనం చేశాడు..పుతిన్‌ పై రహస్య కుమార్తె కామెంట్‌

Updated on: Aug 11, 2025 | 7:20 AM

 రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అతని రహస్య కుమార్తె ఎలిజవేటా క్రివోనోగిఖ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అతను తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నాడని నేరుగా కాకుండా పరోక్షంగా విమర్శించింది. ఈ ఆరోపణలు పుతిన్‌ని ఉద్దేశించి ఆమె చేసిందని మీడియా చెబుతోంది.

టెలిగ్రామ్‌ చానల్‌లో ఎలిజవేటా వరుస పోస్ట్‌లు పెట్టింది. తన ముఖాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించే విషయం గురించి.. అలాగే తన జీవితాన్ని ఎవరు నాశనం చేశారో తనకు గుర్తుండిపోతారని తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల సమయంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. 22 ఏళ్ల ఎలిజవేటా , పుతిన్, అతని మాజీ ఉద్యోగి స్వెత్లానా కుమార్తె అన్నదే అందరి నమ్మకం. 2020లో కోటీశ్వరురాలైన స్వెత్లానా ఆస్తులపై దర్యాప్తు జరిగింది. ఆ సమయంలో ఎలిజవేటా స్వెత్లానాకు పుతిన్‌కు పుట్టిన రహస్య కుమార్తె అని కనుగొన్నట్లు స్వతంత్ర మీడియా సంస్థ ప్రోక్ట్ పేర్కొంది. స్వెత్లానా.. ఆ సంపదను పుతిన్‌ ద్వారా పొందారనే ఆరోపణలున్నాయి. స్వెత్లానా కుమార్తెకు పుతిన్‌ పోలికలున్నాయని కూడా ప్రోక్ట్ పేర్కొంది. అయితే, క్రెమ్లిన్ ఈ వాదనను తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఎలిజవేటా బర్త్ సర్టిఫికెట్‌లో ఆమె తండ్రి పేరు లేదు. 2021లో జరిగిన ఒక ఆడియో ఇంటర్వ్యూలో, ఎలిజవేటా.. పుతిన్‌తో తనకున్న పోలికలను ధృవీకరించలేదు. తిరస్కరించనూలేదు.

మరిన్ని వీడియోల కోసం :

భయానకం పిడుగు .. వామ్మో ఆకాశమే తగలబడిందా అన్నట్లు వీడియో!

ఆ గ్రామంలో ఒకే ఒక్కడు..వీడియో

టీవీ రిపేర్ చేస్తామని ఇంట్లోకి వచ్చిన వ్యక్తి..కాసేపటికే సీన్ సితార్!