ఆందోళనకారులపై పాక్ సాయుధ బలగాల కాల్పులు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోరుతూ తిరగబడుతున్నారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఆందోళనల్లో సాయుధ బలగాలు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజులుగా పీవోకేలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. మార్కెట్లు, రవాణా నిలిచిపోయి పరిస్థితి హింసాత్మకంగా మారింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. తమ హక్కులను కాలరాస్తున్నారంటూ పాకిస్తాన్‌లో ఉండబోమని ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిరసనలను అణచివేసేందుకు పాక్ సాయుధ బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మరణించినట్లు సమాచారం. గత మూడు రోజులుగా పీవోకేలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ హింసాత్మక ఆందోళనల కారణంగా మార్కెట్లు, దుకాణాలు మూతబడ్డాయి. రవాణా సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు భయంతో పారిపోతున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. పీవోకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా, హింసాత్మకంగా మారింది. ప్రజల ఆగ్రహం పాక్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ranbir Kapoor: ప్రయోగానికి రెడీ అవుతున్న రణబీర్ కపూర్
Spirit: కరీనా ప్లేస్‌లో మలయాళ బ్యూటీకి ఛాన్స్
మళ్లీ మొదలైన యానిమేటెడ్ మూవీస్ ట్రెండ్
