చైనా కారులో మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా పుతిన్ కారు వీడియో

Updated on: Sep 02, 2025 | 9:27 PM

షాంఘై సహకార సదస్సు కోసం చైనాలో ల్యాండ్ అయిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీ అక్కడ ప్రయాణించేందుకు కావాల్సిన ఏర్పాట్లను స్వయంగా అధ్యక్షుడు శీ జిన్ పింగ్ పర్యవేక్షించారు. ప్రధాని మోడీ ప్రయాణించేందుకు గాను శీ జిన్ పింగ్ ఒక విలాసవంతమైన కారును ఏర్పాటు చేశారు. దాని పేరు హాంగ్‌చీ ఎల్ 5 లిమోజిన్. హాంగ్‌చీ ఎల్ 5 ధర మన కరెన్సీలో ఏడు కోట్ల రూపాయలు. హాంగ్‌చీ ఎల్ 5 8.5 సెకన్లలో 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకోగలదు. 210 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ను చేరుకో గలదు. ఈ కారును అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే బీస్ట్ తో పోలుస్తుంటారు. మీడియాలో చైనా ఉత్పత్తిగా ఈ కారు ప్రచారంలో ఉంది.

ఈ కారు అందంతో ఆకర్షించడం మాత్రమే కాదు, రోడ్డుపై గుంతలు, అడ్డంకులను కూడా ప్రయాణికులకు తెలియకుండా చేసే అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ ఇందులో ఉంది. సాధారణంగా ఇలాంటి సదస్సుల వేళ దేశాధినేతలు వేరువేరు కార్ల కన్వెన్షన్లో సదస్సు వేదికకు వస్తుంటారు. కానీ షాంఘై సహకార సదస్సులో మాత్రం ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కార్లో వేదిక వద్దకు చేరుతున్నారు. మోడీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. మోడీతో కలిసి ప్రయాణించారని అధ్యక్షుడు పుతిన్ అనుకున్నారని మోడీ కోసం పది నిమిషాల పాటు వేచిచూశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు షాంఘై సహకార సదస్సుకు పుతిన్ తన ఆర్ ఎస్ సెనేట్ లిమోజిన్ కారును తీసుకొచ్చారు. అందులోనే మోడీ పుతిన్ సదస్సు ప్రాంగణానికి చేరారు. అమెరికా అధ్యక్షుడు వాడే దీనిలో కూడా చాలా ఫీచర్లున్నాయి. తూటా బాంబు దాడులను తట్టుకునేలా దీనిని బాలిస్టిక్ ప్రమాణాలకు అనుగుణంగా మెటీరియల్ తో నిర్మించారు. దీనిలో రసాయన దాడి నుంచి అధ్యక్షుడిని రక్షించేందుకు అన్ని ప్రత్యేక సౌకర్యాలున్నాయి. అదనపు ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అగ్ని ప్రమాదాలను నివారించే వ్యవస్థ కూడా దీనిలో ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

కోళ్లగూడులో ఊహించని సీన్‌.. భయంతో పరుగులు తీసిన రైతు వీడియో

పాముకి చుక్కలు చూపించిన పిల్లి.. చివరికి వీడియో

విడాకులిచ్చిన భార్యకు షాక్.. భర్తకు జాక్‌పాట్‌.. ఏం జరిగిందట వీడియో