పిల్లలు స్కూల్ డుమ్మా కొడితే తల్లిదండ్రులకు జైలు శిక్ష
కఠిన చట్టాలతో పేరుగాంచిన దేశం సౌదీ అరేబియా. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు కోసం ఆ దేశం సంచలన చట్టం తీసుకువచ్చింది. ఎవరైనా విద్యార్థి సమాచారం ఇవ్వకుండా 20 రోజులు స్కూల్‌కు డుమ్మా కొడితే ఆ విద్యార్థి తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించాలని సౌదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా కథనాలు వెలువరించింది. బాలల సంరక్షణ చట్టానికి అనుగుణంగా పిల్లల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపినట్లు పేర్కొంది.
కఠిన చట్టాలతో పేరుగాంచిన దేశం సౌదీ అరేబియా. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు కోసం ఆ దేశం సంచలన చట్టం తీసుకువచ్చింది. ఎవరైనా విద్యార్థి సమాచారం ఇవ్వకుండా 20 రోజులు స్కూల్‌కు డుమ్మా కొడితే ఆ విద్యార్థి తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించాలని సౌదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా కథనాలు వెలువరించింది. బాలల సంరక్షణ చట్టానికి అనుగుణంగా పిల్లల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపినట్లు పేర్కొంది. వా20 రోజుల పాటు విద్యార్థి పాఠశాలకు రాకపోతే గార్డియన్‌గా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతారు. అతడు లేదా ఆమె నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ఆబ్సెంట్ అయినట్లు భావిస్తే జడ్జి నిర్ణయాధికారాన్ని బట్టి అతడికి జైలు శిక్ష వ్యవధిని నిర్ణయించనున్నారు. అయితే ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా విద్యార్థి ఆబ్సెంట్ గురించి నివేదిక తయారుచేసి స్కూల్ ప్రిన్స్‌పాల్.. పై విభాగానికి పంపుతారు. విచారణ చేసి ఆ నివేదకను నేరుగా విద్యాశాఖకు పంపుతారు. ఆ తర్వాత కుటుంబ వ్యవహారాల శాఖ విద్యార్థిని గార్డియన్‌ను వ్యక్తిగతంగా విచారించి నివేదిక రూపొందించనున్నారు. దీనిపై జైలు శిక్ష నిర్ణయాధికారాన్ని కోర్టుకు విడిచిపెడతారు. ప్రస్తుతం ఇక్కడ వేసవి సెలవులు. ఇదిలావుంటే సౌదీ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్‌లో ఇటుక బిర్యానీ.. తింటే యమ రుచిలే !!
లారీ చక్రాలమధ్య నిల్చుని యువకుడు స్కేటింగ్ !!
చంద్రుడిపై బెంగళూరు యువకుడు ?? నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో
ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడు.. ఆ తర్వాత ??
పళ్లతో.. బరువులు ఎత్తుతూ గిన్నిస్ రికార్డ్ !!