Loading video

Food Crisis in Gaza: గాజాలో తీవ్ర ఆహార కొరత.! రఫా శిబిరంలో పాలస్తీనియన్ల స్థితి దారుణం.

|

Dec 25, 2023 | 7:51 PM

గాజాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. తాజాగా రఫా శిబిరాలలో తలదాచుకున్న వందలాది మంది ఆహారం కోసం అలమటిస్తున్నారు. స్థానికంగా వండి వార్చుతున్న ఆహారం వారికి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా జనాల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొందరు పెద్ద డేగ్చాలు ఏర్పాటు చేసి వండుతున్న ఆహారం కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు.

గాజాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. తాజాగా రఫా శిబిరాలలో తలదాచుకున్న వందలాది మంది ఆహారం కోసం అలమటిస్తున్నారు. స్థానికంగా వండి వార్చుతున్న ఆహారం వారికి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా జనాల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొందరు పెద్ద డేగ్చాలు ఏర్పాటు చేసి వండుతున్న ఆహారం కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, కరెంటు కొరతతో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కరెంటు, తిండితో పాటు గుక్కెడు మంచి నీరు కూడా దొరకక పౌరుల బతుకు దుర్భరంగా తయారైంది.

సరిహద్దును దాటి గాజాలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కులపై ఎగబడ్డ జనం అందినకాడికి సామగ్రిని ఎత్తుకుపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నందున గాజాలో మానవతా సహాయానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో గాజా ప్రజలకు ఆహారం దొరకడం కష్టంగా మారింది. చివరకు తుపాకుల సాయంతో ట్రక్కులను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫార్మసీ షాపుల్లో అత్యవసర మందులన్నీ నిండుకున్నాయి. నిత్యవసర సరకుల కోసం ఎక్కడ చూసినా భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంటోంది. ట్రక్కుల్లోని మంచి నీళ్ల బాటిళ్ల కోసం పెద్దలు, చిన్న పిల్లలు గుంపులుగా ఎగబడటం అక్కడి ప్రజల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటిదాకా ఏడు వేలకు పైగా చిన్నారుల సహా 17,700 మందికి పైగా గాజా ప్రజలను ఇజ్రాయెల్ హతమార్చిందని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరోపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.