Onam: అంటార్కిటికాలో గడ్డ కట్టిన మంచు మీద ‘భారతీయ పండుగ’.. విదేశాల్లో కూడా సత్తా చాటుతున్న మన పండగ..
భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. తాజాగా మంచుకొండలపై ఓ భారతీయ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలను ప్రముఖ
భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. తాజాగా మంచుకొండలపై ఓ భారతీయ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈపోస్టు తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా కేరళ ప్రజలు ఓనమ్ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మలయాళీలు ఎక్కడ ఉన్నా ఓనమ్ పండుగ జరుపుకోవడం చూస్తాం. సంక్రాంతికి ముగ్గులు వేసినట్టుగా ఓనమ్ సందర్భంగా రంగుల రంగుల రంగవల్లులను ఎంతో అందంగా తీర్చి దిద్దుతారు. ఈ క్రమంలో అంటార్కిటికాలో గడ్డ కట్టిన మంచు మీద రంగోలి ముగ్గును చెక్కిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.అంటార్కిటికాలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి. మంచు బాగా గడ్డకట్టి ఉంటుంది. అలా గడ్డకట్టిన మంచుపై కొందరు యువకులు ఓనమ్ ముగ్గును చెక్కారు. ఇందుకోసం చిన్నపాటి సుత్తి, స్క్రూ డ్రైవర్లను ఉపయోగించారు. వారంతా కలిసి ఎంతో అద్భుతంగా ఓనం ముగ్గును చిత్రీకరించారు. దాని కింద ఓనమ్ ఎట్ అంటార్కిటికా అనే అక్షరాలనూ చెక్కారు. చివరికి అంతా కలిసి ఆ ముగ్గు దగ్గర నిలబడి ఫొటోలకు పోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయులు ఓనమ్ పండుగను జరుపుకోకుండా ఆపలేం. అది అంటార్కిటికా అయినా సరే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనికి నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
