Elon Musk: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి అసాధ్యం

Updated on: Dec 03, 2025 | 5:19 PM

అమెరికా అభివృద్ధికి ఇండియన్ల ప్రతిభ కీలకమని ఎలాన్ మస్క్ అన్నారు. నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో మస్క్ మాట్లాడుతూ, హెచ్-1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టి, దేశ సరిహద్దులను నియంత్రించాలని సూచించారు. అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని, టాప్ కంపెనీలు ఇండియన్ ప్రతిభను గుర్తించి అధిక వేతనాలు చెల్లిస్తాయని చెప్పారు. భారతీయ వృత్తి నిపుణులు సమాజానికి ఎక్కువ అవుట్‌పుట్ ఇవ్వాలని మస్క్ పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్షుడు ఇండియన్స్‌ వీసాలపై ఆంక్షలు విధిస్తున్న వేళ ఆ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఇండయన్సే లేకపోతే అమెరికా అభివృద్ధి అడుగు కూడా ముందుకు పడదని మస్క్‌ కుండబద్దలు కొట్టారు. అనేక ఏళ్లుగా ఇండియన్స్‌ టాలెంట్‌ను అమెరికా వాడుకుని లబ్ధిపొందిందని మస్క్‌ అన్నారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ నిర్వహించిన ‘పాడ్‌కాస్ట్‌లో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ గతంలో దుర్వినియోగమైందని, గత ప్రభుత్వాల ఉదాసీనత వలనే వలసలకు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయని మస్క్‌ వివరించారు. బైడెన్‌ హయాంలో బోర్డర్ లో బొత్తిగా నియంత్రణ లేదని, దీంతో పెద్దసంఖ్యలో అక్రమ వలసలు పెరిగాయని చెప్పుకొచ్చారు. బోర్డర్ లో నియంత్రణ లేకపోతే, అది దేశమే కాదన్నారు. అయితే, విదేశీ ప్రతిభావంతులు అమెరికా వచ్చి.. తమ అవకాశాలను కొల్లగొడుతున్నారనే భావనలో వాస్తవమెంతో కచ్చితంగా చెప్పలేనన్నారు మస్క్‌. అమెరికాలో నిపుణుల కొరత ఉందనేది తన ప్రత్యక్ష పరిశీలనలో రుజువైన విషయమని మస్క్ వెల్లడించారు. సంక్లిష్టమైన పనులను చేయడానికి ప్రతిభావంతులను నియమించుకోక తప్పదని, స్పేస్‌ ఎక్స్‌, టెస్లా, ఎక్స్‌ వంటి టాప్‌ యూఎస్‌ కంపెనీల చీఫ్‌గా తాను ఎప్పుడూ ప్రతిభావంతుల కోసమే చూస్తానని, వారికి సగటు కన్నా ఎక్కువ వేతనాలు చెల్లించటానికి తాను సిద్ధపడతానని మస్క్ చెప్పారు. హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌ను కొనసాగిస్తూ, దాని దుర్వినియోగాన్ని అరికట్టాలని మస్క్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో కొలువును ఆశించే భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “తాము పొందినదానికంటే ఎక్కువ అవుట్ పుట్ ఇచ్చే వారిని నేను గౌరవిస్తాను. తీసుకునే దాని కన్నా సమాజానికి ఎక్కువ ఇచ్చే వారిగా ఉండండి. ఇన్‌పుట్‌ కన్నా ఔట్‌పుట్‌ ఎక్కువ విలువైనది.” అని మస్క్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ లో కొత్త రూల్స్

ఫ్రీజర్‌లా మారిన అమెరికా.. మంచులో జారుతూ.. జూలో జంతువుల ఆటలు

ఆ విషయంలో నయన్‌ని ఫాలో కీర్తి సురేష్.. అదే ఆమె చేసిన తప్పా ??

నా కోసం కథలు రాయకండి.. కథల కోసమే నేను ఉంది

విజయ్‌కి సలహా ఇవ్వనంటున్న కమల్ హాసన్.. కారణం

Published on: Dec 03, 2025 05:18 PM