రచ్చ రచ్చగా మిస్ యూనివర్స్‌ భామల వాకౌట్‌తో షాక్‌

Updated on: Nov 10, 2025 | 4:27 PM

థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్‌ను ఉన్నతాధికారి బహిరంగంగా అవమానించారు. దీనికి నిరసనగా ఫాతిమా, ఇతర పోటీదారులు వేదిక నుంచి సామూహికంగా వాకౌట్ చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వాలనే సందేశంతో ఈ చారిత్రక నిరసన అందాల పోటీల చరిత్రలో సంచలనం సృష్టించింది.

థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న మిస్ యూనివర్స్ పోటీల్లో అందాల భామలు వాకౌట్‌ చేసారు. థాయ్‌ ఉన్నతాధికారి.. మిస్ మెక్సికో ఫాతిమా బాష్‌ను బహిరంగంగా అవమానించారు. దీనికి నిరసనగా పలు దేశాల నుంచి వచ్చిన పోటీదారులు వేదిక నుంచి సామూహికంగా వాకౌట్ చేశారు. ఇది అందాల పోటీల చరిత్రలో సంచలనం సృష్టించింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో.. ఆతిథ్య దేశానికి చెందిన మిస్ యూనివర్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మిస్ మెక్సికో ఫాతిమా బాష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన ఫేస్‌బుక్ లో లైవ్‌స్ట్రీమ్ కావడంతో నిమిషాల్లోనే వైరల్ అయింది. ఒక షూట్‌కు హాజరు కాని ఫాతిమా బోష్‌ను ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌ బహిరంగంగా ప్రశ్నించారు. ఆయన ఆమెను “తెలివితక్కువ వ్యక్తి” అనే అర్థం వచ్చేలా నిందించారు. అతను చేసిన అవమానకర వ్యాఖ్యలపై ఫాతిమా తీవ్రంగా స్పందించారు. ఫాతిమా ఏం చెప్పారంటే.. మీరు మమ్మల్ని గౌరవించినట్లే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి. ఒక మహిళగా నాకు మాట్లాడే హక్కు ఉంది, మీరు నన్ను గౌరవించడం లేదు అని ఘాటుగా బదులిచ్చారు. ఫాతిమా మాటలతో ఆగ్రహించిన ఆ అధికారి.. ఆమెను బయటకు పంపించడానికి సెక్యూరిటీని పిలిచారు. దీంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. ఫాతిమా వాకౌట్ చేశారు. అది చూసిన తోటి అందాల తారలు కూడా వేదిక నుంచి వెళ్లిపోయారు. ఇది మిస్ యూనివర్స్ చరిత్రలో ఒక అరుదైన దృశ్యం కాగా.. మహిళలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిరసన చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవిభక్త కవల పాములను చూశారా ??

భారత్‌లో ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు ?? లారిస్సా ఏమంది అంటే

టీచర్‌కు రూ.88 కోట్ల నష్టపరిహారం.. ఆ రోజు ఏం జరిగిందంటే ??

బహుబలి అరటి హస్తం..ఏకంగా 80 పండ్లు.. సెల్ఫీ దిగిన కొనుగోలుదారులు

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు.. ఇక పల్లెల్లోనూ హైస్పీడ్ నెట్