ఐదేళ్ల క్రితం బహ్రెయిన్‌లో మృతి.. ఇప్పుడు అంత్యక్రియలు

Updated on: Sep 01, 2025 | 9:06 PM

పుట్టింది మొదలు జీవితమంతా పేదరికంలోనే గడిచింది. పెళ్లి అయిన తర్వాతైనా జీవితం బాగుపడుతుందనుకుంటే భర్త తాగుబోతు అయ్యాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వచ్చింది. కానీ, వృద్ధురాలైన తల్లికి భారం కావటం ఇష్టం లేక.. బంధువుల సాయంతో ఖతార్ వెళ్లింది. అక్కడ.. సరైన ఉద్యోగం లేక తిప్పలు పడుతుంటే.. ఈ సంగతి తెలిసిన తల్లి.. అప్పుచేసి మరీ డబ్బు పంపి.. కూతురిని ఇంటికి తీసుకురాగలిగింది.

అయితే.. భార్య విదేశం నుంచి వచ్చిన సంగతి తెలుసుకున్న ఆమె భర్త మళ్లీ వచ్చి.. వేధిస్తుండటంతో హైదరాబాద్ వెళుతున్నానని చెప్పిన ఆ యువతి.. బహ్రెయిన్ వెళ్లిపోయింది. అక్కడ ఒకరి ఇంటిలో పనిచేస్తుండగా.. అక్కడా దురదృష్టమే వెంటాడింది. దీంతో, 2020లో ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూసింది. ఇలా.. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన కోరాడ సత్యవతి జీవితం ముగిసిపోయింది. కానీ, ఆ పరాయిదేశంలో ఆమెకు నా అనేవారు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం అనాథ శవంగా పేర్కొంటూ మార్చురీలోని ఫ్రీజర్‌లో పెట్టేసింది. మరణించి ఐదేళ్లవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవటంతో ఇన్నాళ్లూ ఆమె మృతదేహం అంత్యక్రియలకు నోచుకోలేదు. కాగా, ఆమె మృతదేహానికి ఆగస్టు 20న అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం నుంచి తాజాగా.. సత్యవతి తల్లికి ఓ సందేశం అందింది. ఓ అజ్ఞాత వ్యక్తి అందించిన ఆర్థిక సాయంతో సత్యవతి అంత్యక్రియలు పూర్తిచేశారు. దీనిపై సత్యవతి తల్లి మాట్లాడుతూ.. తన కుమార్తె జీవితమంతా కష్టాలేనని, భర్త వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ వెళుతున్నానని చెప్పి.. విదేశం వెళ్లి పొట్టపోసుకుందని వెల్లడించింది. అయితే.. అక్కడి రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయిందనే కబురు వచ్చే వరకు ఆమె హైదరాబాద్‌లోనే ఉందని అనుకున్నామని ఆమె వాపోయారు. పరాయిదేశంలో కూతురు చనిపోయందని తెలిసినా.. తమ పేదరికం వల్ల బిడ్డ శవాన్ని తెచ్చుకోలేకపోయానని, ఇటీవలే ఓ దాత సాయంతో అక్కడి తెలుగువారు తన బిడ్డకు అంత్యక్రియలు చేశారని ఆమె వివరించింది. కడసారైనా తన బిడ్డ ముఖం చూసే అవకాశం లేకుండా పోయిందని ఆ వృద్ధురాలు కన్నీరు మున్నీరైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దెయ్యం పట్టిందని భర్తను చితక్కొట్టిన భార్య.. ఆ తరువాత సీన్‌ ఇదే

భార్య ‘బంగారం’ కోసం 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాడు

ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్‌ 7న డోంట్‌ మిస్‌

Upasana Konidela: ఈ స్థాయి ఎవరో ఇచ్చింది కాదు.. నాకు నేనుగా సాధించుకున్నది

4 నెలల్లో 6G వస్తోంది..ప్రధాని మోదీ కీలక ప్రకటన