సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి

Updated on: Oct 06, 2025 | 9:32 PM

సముద్ర గర్భంలో అనేక రకాల జీవులే కాదు.. నిధినిక్షేపాలూ ఉంటాయి. తాజాగా కొందరు డైవర్లకు భారీ బంగారు, వెండి, వజ్రాల నిధి దొరికింది. ఫ్లోరిడాకు సమీపంలో అట్లాంటిక్‌ సముద్రంలో ఈ నిధిని కనుగొన్నారు. వందల ఏళ్ల క్రితం స్పెయిన్‌కు చెందిన కొన్ని ఓడలు ఈ ప్రాంతపు సముద్రంలో మునిగిపోయాయయని, ఈ దొరికిన నిధి అప్పటిదేనని పరిశోధకులు భావిస్తున్నారు.

కొన్ని వందల ఏళ్ల క్రితం వెండి, బంగారం, వజ్రాలతో నిండిన స్పెయిన్‌కు చెందిన ఓడలు సముద్రంలో మునిగిపోయిన చోట తాజాగా 10 లక్షల డాలర్ల విలువైన నిధిని కనుగొన్నారు కొందరు డైవర్లు. ఫ్లోరిడాకు సమీపంలోని అట్లాంటిక్‌ తీరంలో ఓ కంపెనీ తరఫున వెళ్లిన డైవర్స్‌కి ఈ నిధి దొరికింది. ఇందులో 1,000 బంగారు, వెండి నాణేలు ఉన్నాయి. ఇవి అప్పటి స్పానిష్‌ పాలనలో ఉన్న బొలీవియా, మెక్సికో, పెరు దేశాలకు చెందిన ముద్రలతో ఉన్నాయి. ఇప్పటికీ అవి స్పష్టంగా కనిపిస్తుండటం విశేషం. అప్పట్లో స్పెయిన్‌ నుంచి బయలుదేరిన నౌకలు కొన్ని న్యూ వరల్డ్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యాయి. 1715 జులై 31న వచ్చిన తుపానులో ఆ ఓడలు ధ్వంసమై అందులోని నిధి మొత్తం సముద్రంలో పడిపోయింది. అప్పట్లో నీళ్లపాలయిన ఆ నిధి ప్రస్తుత అంచనా విలువ దాదాపు రూ. 3550 కోట్లు. ఫ్లోరిడాలోని టర్కోయిజ్‌ జలాల అడుగు భాగాన ఉన్న ఆ ప్రదేశాన్నే ‘ట్రెజర్‌ కోస్ట్‌’ అని పిలుస్తారు. ఇటీవల షిప్‌రెక్‌ కంపెనీకి చెందిన డైవర్ల బృందం జరిపిన అన్వేషణలో ఈ నిధికి సంబంధించిన కొన్ని నాణేలు దొరకాయి. దొరికింది. ఈ బృందంలో లెవిన్‌ షేవర్స్‌ అనే డైవర్‌ ఈ నాణేలను కనుగొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్‌.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు

US Army Beard Ban: సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం

Rohit Sharma: రోహిత్‌ శర్మకు ఊహించని షాక్

New Traffic Rules: వాహనదారులకు ఇక దబిడి దిబిడే.. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ ఇవే!

స్పేస్‌ డెలివరీ వెహికిల్‌ రెడీ.. గంటలో ప్రపంచంలో ఏ మూలకైనా సరుకు రవాణా