దుస్తులు తీసేసి ఫోటోలకు ఫోజులు.. గ్రామీ వేడుకల్లో షాకింగ్‌ ఘటన

Updated on: Feb 09, 2025 | 10:34 PM

సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గాయనీ గాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ వేడుకలో షాకింగ్‌ ఘటన ఒకటి జరిగింది. అమెరికన్ ర్యాప్ సింగర్ భార్య ఫొటోషూట్‌లో దుస్తులు తీసేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గ్రామీ వేడుకలకు అమెరికన్‌ ర్యాపర్‌ కాన్యే వెస్ట్‌ 2025లో బెస్ట్ ర్యాప్ సాంగ్‌కు నామినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఫంక్షన్‌కు తన భార్య, మోడల్‌ బియాంకా సెన్సోరీ తో కలిసి వచ్చారు. అవార్డ్‌ ఫంక్షన్‌లోకి రాగానే రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ వెళ్లారు. ఇంతలో బియాంకా ఉన్నట్టుండి తన దుస్తులు తీసేసీ న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. నిర్వాహకులు వెంటనే ఆ జంటను అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయితే, బియాంక ఎందుకు అలా ప్రవర్తించారో తెలియరాలేదు. ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ను గ్రామీ పురస్కారం వరించింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ గతేడాది డిసెంబర్‌ 30న కన్నుమూశారు. మరణానంతరం ఆయనను ఈ పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘ది లాస్ట్‌ సండేస్‌ ఇన్‌ ప్లేన్స్‌’కు బెస్ట్‌ ఆడియోబుక్‌ నెరేషన్‌ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మనవడు జేసన్‌ కార్టర్‌ అందుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుంభమేళా ట్రాఫిక్ జామ్‌ లో.. బస్సు టాప్ పై వీళ్లు ఏం చేశారంటే..

మీకు తరచూ ఆకలిగా అనిపిస్తుందా? కారణం ఇదే

సన్యాసం తీసుకున్న మరో హీరోయిన్.. ఇదేంటిలా?

షాకింగ్ న్యూస్.. సాయిపల్లవి డైరెక్షన్లో… నాగ చైతన్య హీరోగా సినిమా!

శోభితపై దారుణ విమర్శలు! బాధపడిన నాగ చైతన్య..