అమెరికాలో కిడ్నాప్‌కు గురైన హైదరాబాదీ మృతి.. ఇది పదకొండవ మరణం
అమెరికాలో మన విద్యార్థి మరొకరు చనిపోయారు. ఎంఎస్ చేయడానికి వెళ్లిన హైదరాబాదీ యువకుడు అర్ఫాత్ మృతదేహాన్ని క్లీవ్ లాండ్ పోలీసులు గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్ లోని పేరెంట్స్ కు న్యూయార్క్ లోని భారతీయ ఎంబసీ సమాచారం అందించింది. అర్ఫాత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. ఈ అనుమానాస్పద మరణంపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని, వారితో నిత్యం టచ్ లో ఉంటామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు.
అమెరికాలో మన విద్యార్థి మరొకరు చనిపోయారు. ఎంఎస్ చేయడానికి వెళ్లిన హైదరాబాదీ యువకుడు అర్ఫాత్ మృతదేహాన్ని క్లీవ్ లాండ్ పోలీసులు గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్ లోని పేరెంట్స్ కు న్యూయార్క్ లోని భారతీయ ఎంబసీ సమాచారం అందించింది. అర్ఫాత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. ఈ అనుమానాస్పద మరణంపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని, వారితో నిత్యం టచ్ లో ఉంటామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. కాగా, అర్ఫాత్ మరణంతో అమెరికాలో చనిపోయిన మన విద్యార్థుల సంఖ్య పదకొండుకు చేరింది. మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఎంఎస్ చదివేందుకు గతేడాది అమెరికా వెళ్లాడు. ఓహియోలోని క్లీవ్ లాండ్ వర్సిటీలో చేరి విద్యాభ్యాసం చేస్తున్నాడు. మూడు వారాల నుంచి అర్ఫాత్ కనిపించడంలేదని, ఫోన్ కూడా చేయలేదని హైదరాబాద్ లోని ఆయన తల్లిదండ్రులు తోటి విద్యార్థుల సాయంతో క్లీవ్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ
పైకి గడ్డి వాము.. లోపల చూస్తే కళ్లు జిగేల్.. అదేంటో మీరే చూడండి..
మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 5000 మందికి పాస్‌పోర్టులు ఫ్రీ..