Hindu Temple: హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..

|

Nov 07, 2024 | 5:06 PM

కెనడాలో హిందువుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆ దేశంలో నివసిస్తున్న హిందువులపై నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రాంప్టన్ లో మరోసారి హిందువులపై దాడులు జరిగాయి. ఇక్కడ ఖలిస్తానీలు బ్రాంప్టన్ హిందూ ఆలయంపై దాడి చేశారు. అక్కడ భక్తులపై దాడులకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో జరిగిన హింసాత్మక ఘటనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.

కెనడాలో నివసిస్తున్న పౌరులందరూ తమ మత విశ్వాసాలను ఆచరించే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. హిందూ సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించిన పీల్ ప్రాంతీయ పోలీసులకు ప్రధాని ట్రూడో కృతజ్ఞతలు చెప్పారు. బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరం వద్ద జరిగిన హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని స్పష్టం చేశారు.

వాస్తవానికి బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాడికల్స్ హఠాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై విజయ్ జైన్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా కెనడాలోని పీల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఎక్కడ ఉన్నారని జైన్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆలయంలోని హిందూ భక్తులపై ఖలిస్థానీ దాడులు చేస్తున్నారంటూ ఆ ట్వీట్‌లో కెనడా ప్రధానిని కూడా జైన్ ట్యాగ్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. అదే సమయంలో నితిన్ చోప్రా అనే వ్యక్తి ఈ సంఘటనను ఖండించారు. కెనడాలో హింస, ద్వేషపూరిత చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. ఈ పరిస్థితి మరింత అదుపు తప్పకముందే.. తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ హింసాకాండను సిక్కు, హిందూ సంఘాలు ఖండిస్తున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.