KFC Veg chicken video: శాకాహారులకు కేఎఫ్‌సీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న వెజ్ చికెన్..(వీడియో)
KFC: కెంటకీ ఫ్రైడ్ చికెన్.. ఇలా చెబితే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. కేఎఫ్‌సీ అంటే అందరూ గుర్తుపడతారు. అంతలా ప్రాచుర్యం సంపాదించుకుందీ సంస్థ. ఎక్కడో అమెరికాలో మొదలైన కేఎఫ్‌సీ తెలుగు..
KFC: కెంటకీ ఫ్రైడ్ చికెన్.. ఇలా చెబితే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. కేఎఫ్‌సీ అంటే అందరూ గుర్తుపడతారు. అంతలా ప్రాచుర్యం సంపాదించుకుందీ సంస్థ. ఎక్కడో అమెరికాలో మొదలైన కేఎఫ్‌సీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాచుర్యం సంపాదించుకుందటేనే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక కేఎఫ్‌సీ పేరువినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది చికెన్, ఇందులో నాన్ వెజ్ వంటకాలే ఎక్కువగా ఉంటాయి. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి.? వారు కూడా కేఫీఎస్‌లో సమయం గడిపే అవకాశం లేదా అంటే.. కచ్చితంగా ఉందని చెబుతోందీ సంస్థ. త్వరలోనే మొక్కల ఆధారిత చికెన్‌ను తీసుకురావడానికి కేఎఫ్‌సీ సిద్ధమవుతోంది. దీనికి శాకాహారుల చికెన్‌గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయోగాలు కూడా పూర్తయ్యాయి.జనవరి 10 నుంచి అమెరికాలో బియాండ్ మీట్ పేరుతో ఈ వెజ్ చికెన్ రుచులు కస్టమర్స్‌కి అందుబాటులోకి రానున్నాయి. వెజ్‌తో తయారు చేసే ఈ నాన్‌వెజ్ తయారీ కోసం.. లెగ్యుమెస్ (సోయాబీన్స్, లెంటిల్స్), క్వినోవా లాంటి ధాన్యాలు, కోకోనట్ ఆయిల్, సెయిటన్, పచ్చి బఠానీ లాంటి ప్రొటీన్లు ఉన్న కూరగాయలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి తీసుకురానున్న ఈ ఈ వెరైటీ డిష్‌ను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే శాకాహార చికెన్ గురించి ప్రకటించగానే కేఎఫ్‌సీల షేర్ల విలువ ఒక్కసారిగా పెరగడం విశేషం.