భారత్ పై దాడులకు జైషే చీఫ్ కుట్ర వీడియో
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ భారత్‌పై దాడులకు మరోసారి కుట్ర పన్నుతున్నట్లు ఆడియో టేప్ ద్వారా వెల్లడైంది. వెయ్యి మంది ఆత్మహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నారని, భారత్‌లోకి చొరబడేందుకు ఒత్తిడి తెస్తున్నారని అజార్ పేర్కొన్నాడు. ఆపరేషన్ సింధూర్‌తో తీవ్రంగా నష్టపోయినప్పటికీ, రిపబ్లిక్ డే టార్గెట్‌గా కుట్రలు పన్నుతున్నాడనే అనుమానంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ భారత్ పై దాడులకు కొత్త కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆడియో టేపులో మసూద్ అజార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. వెయ్యి మంది ఆత్మహుతి దళ సభ్యులు భారత్ లోకి చొరబడడానికి సిద్ధంగా ఉన్నారని, పర్మిషన్ కోసం తనపై ఒత్తిడి తెస్తున్నారని మసూద్ అజార్ పేర్కొన్నాడు. అయితే, ఈ ఆడియో టేప్ ఎప్పటిదనే దానిపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న మసూద్ అజార్, ఇప్పుడు ఢిల్లీ కారు బాంబు ఘటన, సరిహద్దు చొరబాటు యత్నాలు, జైషే మహమ్మద్ మహిళా విభాగం కార్యకలాపాల నేపథ్యంలో మళ్లీ కుట్రలకు పాల్పడుతున్నాడనే అనుమానం వ్యక్తం అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
