Jagannatha Ratha Yatra: అమెరికాలో పూరీ జగన్నాథ రథయాత్ర.. జగన్నాథ నామస్మరణతో మార్మోగిన ఫ్లోరిడా నగరం..
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా మొదలైంది. శుక్రవారం ఉదయం మొదలైన ఈ యాత్ర తొమ్మిది రోజులు సాగుతుంది. కోవిడ్ కారణంగా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా మొదలైంది. శుక్రవారం ఉదయం మొదలైన ఈ యాత్ర తొమ్మిది రోజులు సాగుతుంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ యాత్రను నిర్వహించలేదు. దీంతో ఈ యాత్రకి భక్తులు వెల్లువెత్తారు. జగన్నాథునికి విశ్వమంతా భక్తులే.. అందుకే ఆయన రథయాత్ర ఒక్క పూరీలోనే కాదు దేశవిదేశాల్లోనూ భక్తులు జగన్నాథ రథయాత్రను జరుపుతుంటారు. ఈ క్రమంలోనే అమెరికాలోని ఫ్లోరిడాలో కూడా వైభవంగా జగన్నాథ రథ యాత్ర నిర్వహించారు. భక్తజన సందోహం మధ్య బలభద్రుడు, సుభద్ర వెంట రాగా ఫ్లోరిడా వీధుల్లో జగన్నాథ రథ చక్రాలు ముందుకు సాగాయి. విదేశీ భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, జెండాలు చేత పట్టి అందంగా అలంకరించిన జగన్నాథుని రథాన్ని ఎంతో ఆనందంతో లాగుతూ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రా దేవిలను ఊరేగించారు. జగన్నాథ రథయాత్రతో ఫ్లోరిడా నగరమంతా ఆథ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ రథయాత్రకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?