ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే

Updated on: Sep 22, 2025 | 8:48 PM

ఇజ్రాయెల్‌.. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటి. అనేక సంవత్సరాలుగా ఐరన్‌ డోమ్ సిస్టమ్‌తో పొరుగునున్న శత్రువుల దాడులను తిప్పికొడుతూ వాటికి చుక్కలు చూపిస్తున్న ఈ దేశంగా ఇజ్రాయెల్ వార్తల్లో నిలిచింది. పలు సందర్భాల్లో ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ను అమెరికా సైతం ప్రశంసించింది.

అంతేకాదు F-35, F-16 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతో బలమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. అయితే.. ఇప్పుడు ఐరన్ డోమ్‌ను మించిన మరో ఆధునిక వ్యవస్థను ఆ దేశం అందిపుచ్చుకుంది. తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి ఎక్కువ నష్టం కలిగించే లేజర్‌ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ.. ఐరన్‌ బీమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఏడాది ఈ సాంకేతికతను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. మనం హాలీవుడ్ సినిమాల్లో చూసే స్టార్ వార్ టైప్ కాన్సెప్ట్‌ ప్రేరణతో.. ఈ కొత్త తరం ఐరన్‌ బీమ్‌ను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సమర్థ, యుద్ధంలో పరీక్షించిన అత్యున్నత శక్తిమంతమైన లేజర్‌ ఇంటర్‌సెప్షన్‌ వ్యవస్థ. ఇది కొత్త తరం ఆయుధాలతో సైనిక రక్షణ వ్యవస్థలో విప్లవంగా దీనిని అభివర్ణిస్తున్నారు. రాఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ఇటీవల ఐరన్‌బీమ్‌ లేజర్‌ సిస్టమ్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. సంప్రదాయ మిసైల్‌ ఇంటర్‌సెప్టర్లు ఒకసారి రాకెట్‌ను అడ్డుకోవాలంటే దాదాపు 60,000 డాలర్లు ఖర్చవుతుంది. ఈ కొత్త ఐరన్‌ బీమ్‌ లేజర్‌ టెక్నాలజీ శత్రు రాకెట్‌, యూఏవీ, మోర్టార్లను అడ్డుకోవాలంటే, ఒక షాట్‌కు 2 డాలర్ల విద్యుత్తు ఖర్చవుతుంది. శత్రుదేశాల నుంచి ఏదైనా క్షిపణి.. తమ దిశగా వస్తుందని గమనించిన క్షణంలోనే ఈ ఐరన్‌ బీమ్‌ దానిని నేలకూల్చేస్తుందని ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని నఫ్తలి బెన్నెట్‌ తెలిపారు. ఇజ్రాయెల్ ఐరన్ బీమ్‌ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రాకెట్లు, డ్రోన్లు, ఇతర యుద్ధ విమానాలను విజయవంతంగా కూల్చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు ఐరన్‌ డోమ్‌, డేవిడ్స్ స్లింగ్ వంటి రక్షణ వ్యవస్థలు ఉండగా ఇప్పుడు ఐరన్‌ బీమ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ డిఫెన్స్ సిస్టమ్‌ తమ మొదటి యూనిట్లను అందుకుంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్

యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ చేయడం నేర్చుకుని.. తొలి ప్రయత్నంలోనే

మందుకొట్టి స్కూలుకొచ్చిన హెడ్‌మాస్టర్‌.. అధికారులపైనే

మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. మోదీ, పవన్ ప్రత్యేక అభినందనలు

Published on: Sep 22, 2025 08:36 PM