ఆ 3 దేశాల దృష్టిలో పాలస్తీనా ఇక స్వతంత్ర దేశం

|

May 25, 2024 | 11:30 AM

ఇజ్రాయెల్​- హమాస్​ యుద్ధంలో ముఖ్య పరిణామం జరిగింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్​, స్పెయిన్​ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. మే 28 నుంచి పాలస్తీనాకు అధికార గుర్తింపును ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయం పట్లు పాలస్తీనా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్​ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే నార్వే, ఐర్లాండ్​లోని తమ రాయబారులను వెనక్కి రావాలని ఆదేశించింది.

ఇజ్రాయెల్​- హమాస్​ యుద్ధంలో ముఖ్య పరిణామం జరిగింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్​, స్పెయిన్​ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. మే 28 నుంచి పాలస్తీనాకు అధికార గుర్తింపును ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయం పట్లు పాలస్తీనా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్​ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే నార్వే, ఐర్లాండ్​లోని తమ రాయబారులను వెనక్కి రావాలని ఆదేశించింది. పాలస్తీనాను అధికారికంగా గుర్తించేందుకు గత కొన్ని వారాలుగా యూరోపియన్​ దేశాలు ప్రయత్నాలు చేపట్టాయి. రెండు దేశాల విభజనకు అంగీకరించి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని కోరుతున్నాయి. తాజాగా నార్వే నిర్ణయంతో అనేక ఇతర యూరోపియన్​ దేశాలు సైతం ఆ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. నార్వేకు ఈయూలో సభ్యత్వం లేకపోయినా రెండు రాష్ట్రాల ప్రతిపాదనకి బలమైన మద్దతును ఇస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే గుర్తింపు తప్పనిసరని నార్వే ప్రధానమంత్రి జోనాస్​ ఘార్​ అన్నారు. మే 28 అధికారికంగా గుర్తించి, అరబ్​ శాంతి ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. మరో వైపు స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తూ ఐర్లాండ్​, స్పెయిన్​​ ప్రధానమంత్రులు కీలక ప్రకటన చేశారు. పాలస్తీనాకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈ నెల ఆరంభంలోనే అగ్రరాజ్యం అమెరికాకు తెలిపింది స్పెయిన్​.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PM Modi Biopic: మోదీ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన నటుడు సత్యరాజ్‌

Trump Biopic: ట్రంప్‌ బయోపిక్‌లో మొదటి భార్యపై లైంగికదాడి సీన్‌

apkతో సైబర్‌ నేరగాళ్ల మోసం.. ఇంతకీ ఏంటీ మోసం ?? ఎలా దోచేస్తున్నారు ??

ఆ పురుగులొచ్చాయంటే వర్షాలకు కరవు లేనట్టే

అందుకే మరి… ఏనుగును తక్కువ అంచనా వేయకూడదు