UKలోని డార్ట్‌ఫోర్డ్‌లో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతం వీడియో
యూకేలోని డార్ట్‌ఫోర్డ్‌లో సునీత గిరిధర్ ఆధ్వర్యంలో 60 కుటుంబాలతో సామూహిక సత్యనారాయణ వ్రతం ఘనంగా జరిగింది. చెమ్స్‌ఫోర్డ్ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్టీల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎంపీ జిన్ డిక్సన్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుక ప్రవాస భారతీయ కమ్యూనిటీ ఐక్యతను చాటింది.
యూకేలోని డార్ట్‌ఫోర్డ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. స్థానికంగా చాలా సంవత్సరాలుగా నివసిస్తున్న సునీత గిరిధర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె డాట్‌ఫోర్డ్ ఇండియన్ అసోసియేషన్‌తో పాటు పలు ఫ్యామిలీ, లేడీస్ గ్రూపులను నడుపుతున్నారు. ఈ వేడుకకు లేబర్ పార్టీ మెంబర్, క్యాండిడేట్‌గా ఉన్న సునీత గిరిధర్ తో పాటు, స్థానిక ఎంపీ జిన్ డిక్సన్ కూడా హాజరయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
