భారత్‌కు ఇంకా చౌకగా రష్యా చమురు..
రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును కొనుగోలు చేస్తుండటం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తున్నారు. అయినా భారత్ మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు మరింత చౌకగా చమురు అమ్మటానికి రష్యా ముందుకొస్తోంది.
అట్లాంటిక్ బేసిన్ నుంచి తీసే.. బ్రెంట్ చమురుతో పోలిస్తే దాదాపు 5 డాలర్లు చౌకగా రష్యా చమురు అమ్ముతోంది. దీంతో.. ట్రంప్ బెదిరింపులను పట్టించుకోకుండా.. మనదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తోంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 1.7 శాతం ఉండగా.. 2024-25 సంవత్సరంలో ఏకంగా 35.1శాతానికి ఎగబాకింది. పరిమాణం పరంగా చూస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 245 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) ముడిచమురును దిగుమతి చేసుకోగా.. ఇందు లో 88 ఎంఎంటీ ముడిచమురు ఒక్క రష్యా నుంచే రావడం గమనార్హం. అమెరికా ఒత్తిళ్ల మధ్య కూడా భారత్‌కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. జులైలో దాదాపు 32 వేల కోట్ల మేర విలువైన చమురును భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇంధన అవసరాల కోసం భారత్ 85 శాతం మేర దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ సహా దాదాపు 40 దేశాల నుంచి ముడిచమురును సమకూర్చుకుంటోంది. గయానా, బ్రెజిల్, కెనడా వంటి దేశాలు కొత్తగా చేరడంతో భారత్ ఇంధన భద్రత మరింత మెరుగుపడింది. రష్యా ఆయిల్ లేకున్నా భారత్ ఇతర దేశాలతో ఉన్న సంబంధాలతో తన డిమాండ్‌కు సరిపడా ముడిచమురును సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగితే దేశ దిగుమతుల వ్యయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.కానీ, ట్రంప్ సుంకాలతో.. ఈ సెప్టెంబర్ నుంచి రష్యా నుంచి మరింత చమురు దిగుమతి చేసుకోవాలని, భారత్ భావిస్తోంది. సుమారు మూడు లక్షల బ్యారెల్స్ చమురును రష్యా నుంచి అదనంగా కొనుగోలు చేయాలని భారత్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అంతేకాక, రష్యా ఒక బ్యారెల్‌పై 2 నుంచి 3 డాలర్ల డిస్కౌంట్ కూడా ఇవ్వటంతో.. భారత్‌కు ఈ కొనుగోళ్లు మరింత లాభదాయకంగా మారనున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండియా దెబ్బకు అమెరికా రివర్స్ గేమ్..
హ్యాట్సాఫ్.. కాకి కోసం ప్రాణాలకు తెగించి
కాళ్లు చచ్చుబడిన కన్నకొడుకు.. ఇంట్లోకి రానివ్వని తండ్రి