Harsh Goenka – Elon Musk: మస్క్ ను తక్కువ అంచనా వేయకండి..! అతడి పిచ్చితనానికి కచ్చితంగా అర్థం – గోయెంకా

|

Nov 26, 2022 | 9:36 AM

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ‘ట్విట్టర్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సగం మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలిగించిన మస్క్‌..

మస్క్ ను తక్కువ అంచనా వేయకండి! Harsh Goenka Shows Support To 'Genius' Elon Musk | TV9
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ‘ట్విట్టర్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సగం మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలిగించిన మస్క్‌.. మిగిలిన వారు అసాధారణ స్థాయిలో రోజంతా పని చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో మస్క్ తీరు నచ్చక మిగిలిన వారు కూడా ఒక్కొక్కరు ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో మస్క్ ట్విట్టర్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.ఈ క్రమంలో, ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎలాన్‌ మస్క్‌ను ఉద్దేశించి ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఎలాన్ మస్క్ ను తక్కువ అంచనా వేయకండి అంటున్నారు. మస్క్‌.. మస్త్‌ మేధావి… అతన్ని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. అతడి పిచ్చితనానికి కచ్చితంగా ఏదో ఒక అర్ధం, విధానం అంటూ ఉంటుంది. అది టెస్లా అయినా, స్పేస్ ఎక్స్ అయినా లేక బోరింగ్ కంపెనీ అయినా సరే, అతడు తన కాలానికంటే ముందున్నాడు. మస్క్‌ వద్ద తప్పకుండా మనం అర్థం చేసుకోలేని గేమ్ ప్లాన్ ఉంటుంది. అతడిని అంచనా వేసే ముందు, తనకి కొంత సమయం ఇచ్చి చూద్దాం’’ అంటూ గోయంకా ట్వీట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 26, 2022 09:36 AM