Hamas Sinwar: హమాస్ దాడుల సూత్రధారి.. కరడుగట్టిన తీవ్రవాది సిన్వర్.. ఎవరు.?

|

Oct 18, 2023 | 8:12 PM

ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన తర్వాత యాహ్యా సిన్వర్ పేరు ఎక్కువగా వినిపించింది. ఇటీవల 1,300 మంది ఇజ్రాయెలీలను చంపిన క్రూరునిగా ఇజ్రాయెల్ అధికారులు అభివర్ణించారు. హమాస్ దాడులకు సూత్రధారి సిన్వరే అని ఆరోపిస్తున్నారు. గాజాలో భూతల దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఈ దాడుల్లో యాహ్యా సిన్వర్, అతని గ్రూప్ తమ లక్ష‍్యంలో ఉన్నారని ఇజ్రాయెల్ ప్రతినిధి చెప్పారు.

ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన తర్వాత యాహ్యా సిన్వర్ పేరు ఎక్కువగా వినిపించింది. ఇటీవల 1,300 మంది ఇజ్రాయెలీలను చంపిన క్రూరునిగా ఇజ్రాయెల్ అధికారులు అభివర్ణించారు. హమాస్ దాడులకు సూత్రధారి సిన్వరే అని ఆరోపిస్తున్నారు. గాజాలో భూతల దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఈ దాడుల్లో యాహ్యా సిన్వర్, అతని గ్రూప్ తమ లక్ష‍్యంలో ఉన్నారని ఇజ్రాయెల్ ప్రతినిధి చెప్పారు. అసలింతకీ సిన్వర్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి..? 1962లో జన్మించిన సిన్వార్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో పెరిగి పెద్దయ్యాడు. అప్పట్లో ఖాన్ యూనిస్‌ నగరం ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది. 1948లో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన తర్వాత సిన్వర్ కుటుంబం గాజాకు తరలి వెళ్లింది. సిన్వర్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్‌లో డిగ్రీ అందుకున్నాడు. 1982లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినందుకు తొలిసారిగా అరెస్టయ్యాడు. పాలస్తీనా ఉద్యమంలో ఇజ్రాయెల్ గూఢచారులపై దాడులు చేయడానికి సలా షెహడేతో జతకట్టి ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్ బలగాల చేతుల్లో షెహడే మరణించిన తర్వాత 2002లో హమాస్ మిలటరీ విభాగానికి సిన్వర్ సారథ్యం వహించాడు. సిన్వార్ 24 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. సిన్వర్ హమాస్‌లో ముఖ్య నేతగా ఎదిగాడు. 2015లో సిన్వర్‌ను అమెరికా.. మోస్ట్‌ వాంటెడ్ టెర్రరిస్టుల లిస్ట్‌లో చేర్చింది. 2017లో గాజాలో హమాస్ అధిపతిగా సిన్వర్ ఎన్నికయ్యాడు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దళాలను సమీకరించాడు. ఆవేశపూరిత ప్రసంగాలకు పేరుపొందిన సిన్వర్.. హమాస్‌కు సంపూర్ణ విధేయత చూపేవాడు. హమాస్ కార్యకర్తల నిఘా విషయంలో ఏ మాత్రం రాజీపడేవాడు కాదని అంటుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..