అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత.. ప్రయాణికులను అనుమతించే 33 దేశాల.. వీడియో

|

Sep 25, 2021 | 9:41 AM

అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని కూడా అనుమతించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది.

అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని కూడా అనుమతించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. నవంబరు నెల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేయనున్నట్లు ప్రకటించిన అమెరికా ఏయే దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించేది తెలుపుతూ 33 దేశాల జాబితాను అమెరికా వెల్లడించింది. దీనిలో చైనా, భారత్, ఇరాన్, ఫ్రాన్స్, యూకే తదితర దేశాలున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పీవీ సింధుతో తలపడ్డ దీపికా పదుకొనే..! కేలరీలు కరిగించేందుకే అంటూ ఫోటోలను షేర్‌ చేసిన దీపిక.. వీడియో

Prabhas: బుల్లితెరపై సందడి చేయనున్న ప్రభాస్‌.. ఫాన్స్‌కి పండగే.. వీడియో