Viral Video: 30 ఏళ్ల తర్వాత బయటపడిన ఘోస్ట్‌ గ్రామం.. ఆ గ్రామాన్నిచూసేందుకు పోటెత్తుతున్న పర్యాటకులు..వీడియో

|

Mar 03, 2022 | 8:24 PM

ప్రకృతిలో మార్పుల్లో భాగంగా అనేక గ్రామాలు కనుమరుగైపోతున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అలా కనుమరుగైపోయిన గ్రామాలు మళ్లీ బయటపడుతున్న సందర్భాలూ చూశాం. తాజాగా యూరోపియన్ దేశమైన స్పెయిన్‌ లోని ఒక గ్రామం 30 ఏళ్ల క్రితం డ్యామ్ నిర్మాణ సమయంలో


ప్రకృతిలో మార్పుల్లో భాగంగా అనేక గ్రామాలు కనుమరుగైపోతున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అలా కనుమరుగైపోయిన గ్రామాలు మళ్లీ బయటపడుతున్న సందర్భాలూ చూశాం. తాజాగా యూరోపియన్ దేశమైన స్పెయిన్‌ లోని ఒక గ్రామం 30 ఏళ్ల క్రితం డ్యామ్ నిర్మాణ సమయంలో నీటి అడుగున మునిగిపోయింది. 1992లో నీట మునిగిపోయిన ఆ గ్రామం తాజాగా బయటపడింది. స్పానిష్ లోని అసెరెడో అనే ఈ ఘోస్ట్ గ్రామం మళ్ళీ వెలుగులోకి రావడం చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. పాత భవనాలు శిథిలావస్థలో కనిపించడంతో స్థానికులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆల్టో లిండోసో రిజర్వాయర్‌ నిర్మాణం సమయంలో అసెరెడోలో భారీగా వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఈ గ్రామం రిజర్వాయర్‌లో మునిగిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న పొడి వాతావరణం కారణంగా స్పానిష్-పోర్చుగీస్ సరిహద్దులోని ఈ ఆనకట్టలో నీరు దాదాపుగా ఖాళీ అయింది. దీంతో శిథిలాలు బయటపడ్డాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌ సామర్థ్యం 15 శాతం మాత్రమే ఉంది. ఆ గ్రామం శిధిలాలను చూసి ఒకప్పుడు ఆ గ్రామ ప్రజలు మంచి స్టేజ్ లో బతికినట్లు భావిస్తున్నారు. ఒకప్పుడు “ఈ ప్రదేశమంతా ద్రాక్షతోటలు, నారింజ చెట్లు ఉండేవని.. గ్రామం పచ్చగా ఉండేదని చెప్పాడు. ఇంతటి విపరీతమైన కరువులకు కారణం వాతావరణ మార్పులే అని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్