గాయం చేసేదీ వాళ్లే! సాయం అందించేదీ వాళ్లే

Updated on: Oct 15, 2025 | 9:18 PM

యుద్ధాన్ని ప్రోత్సహించి ఆయుధాలతో జేబులు నింపుకున్న వారే, యుద్ధం ముగిశాక పునర్నిర్మాణం పేరుతో సాయం అందించేది. గాజాలో లక్షల కోట్ల లాభాలు ఎవరికి చేకూరనున్నాయి? ఇరాక్ ఫార్ములాతో అమెరికా గాయం-సాయం వ్యూహాన్ని అనుసరిస్తుందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 2023లో ఇజ్రాయిల్‌పై హమాస్ మెరుపు దాడుల తర్వాత, గాజాపై ఇజ్రాయిల్‌ ప్రతీకార దాడులు తీవ్ర ప్రభావం చూపాయి.

2023లో ఇజ్రాయిల్‌పై హమాస్ మెరుపు దాడుల తర్వాత, గాజాపై ఇజ్రాయిల్‌ ప్రతీకార దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ భీకర యుద్ధంతో గాజా ఛిద్రమైంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, గాజాలో పది భవనాల్లో తొమ్మిది దెబ్బతిన్నాయి లేదా నేలమట్టమయ్యాయి. లక్షకు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి, మౌలిక సదుపాయాలు 90% కుదేలయ్యాయి. ఈ దాడుల సమయంలో, ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా అమెరికాకు బిలియన్ల డాలర్ల లాభాలు వచ్చాయి. ఆయుధ వ్యాపారం ద్వారా అమెరికా కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు ఆర్జించాయి, అలాగే లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దడ పుట్టిస్తున్న బంగారం ధర.. బుధవారం తులం ఎంతంటే?

వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్… ఏకంగా వైస్ కెప్టెన్సీ ఛాన్స్‌

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో దెబ్బే.. సర్వేలో షాకింగ్ నిజాలు

బైకుపై రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఆ తర్వాత

భారత్‌లో అప్ఘాన్ మంత్రి.. వణుకుతున్న పాక్