Brain Donate: ‘బ్రెయిన్‌’ దానం.. 17 మందిని కాల్చి చంపిన హంతకుడి అంగీకారం.!

|

Jul 13, 2024 | 6:04 PM

అమెరికాలో ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన భీకర కాల్పుల ఘటన అక్కడివారి కళ్లల్లో ఇంకా కదలాడుతూనే ఉంది. విద్యార్థులు, సిబ్బంది సహా మొత్తం 17 మంది చనిపోయిన ఆ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన హంతకుడు తన మెదడును దానం చేసేందుకు అంగీకరించాడు. బాధితుల్లో ఒకరితో కుదుర్చుకున్న ఒప్పందంలోని విషయాలు ఇటీవల బయటకు వచ్చాయి.

అమెరికాలో ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన భీకర కాల్పుల ఘటన అక్కడివారి కళ్లల్లో ఇంకా కదలాడుతూనే ఉంది. విద్యార్థులు, సిబ్బంది సహా మొత్తం 17 మంది చనిపోయిన ఆ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన హంతకుడు తన మెదడును దానం చేసేందుకు అంగీకరించాడు. బాధితుల్లో ఒకరితో కుదుర్చుకున్న ఒప్పందంలోని విషయాలు ఇటీవల బయటకు వచ్చాయి. ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని ఓ హైస్కూల్‌లో నికోలస్‌ క్రజ్‌ అనే యువకుడు ఏఆర్‌-15 రైఫిల్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. ఫిబ్రవరి 14, 2018న జరిగిన ఘటనలో 13 మంది విద్యార్థులతోపాటు నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడిన వాడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిన ఆ ఘటనలో ఆంథోనీ బోర్గెస్‌ అనే విద్యార్థి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. క్రజ్.. క్లాస్‌రూమ్‌లోకి రాకుండా డోర్‌కు అడ్డుగా నిలిచాడు అప్పట్లో 15 ఏళ్ల బోర్గెస్‌పై ఐదుచోట్ల బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో పదికిపైగా సర్జరీలు చేయాల్సివచ్చింది. అయితే, ఘటనాస్థలికి పోలీసులు ఆలస్యంగా చేరుకున్నారనీ స్థానిక పోలీసులకు వ్యతిరేకంగా ఈ కేసులో న్యాయపోరాటం చేస్తున్నాడు బోర్గెస్‌. తీవ్ర గాయాలపాలైన తనకు న్యాయం చేయాలని క్రజ్ కు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతున్న బోర్గెస్‌ ఇటీవల ఓ అసాధారణ ప్రతిపాదన తీసుకువచ్చాడు.

నిందితుడి మెదడు కావాలని.. దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తే, ఆ దుర్మార్గానికి పాల్పడటానికి దారితీసిన కారణాలను గుర్తించవచ్చని భావించాడు. తద్వారా భవిష్యత్తులో అటువంటి ఘటనలను నిరోధించవచ్చని అనుకున్న బోర్గెస్‌..హంతకుడి మెదడు కావాలని న్యాయస్థానంలో పోరాడాడు. అందుకు నికోలస్‌ క్రజ్‌ అంగీకరించడంతో వారిమధ్య సివిల్‌ ఒప్పందం జరిగినట్లు తెలిసింది. ఇందులో భాగంగా క్రజ్‌ పేరును సినిమాలు, పుస్తకాలతోపాటు ఇతర మీడియాలోనూ వాడుకునే హక్కులు సాధించాడు. ఇకపై హంతకుడు మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా బోర్గెస్‌ అనుమతి తీసుకోవలసిందే. బంధువుకు చెందిన 4.3 లక్షల డాలర్ల జీవితబీమా సొమ్మును అందుకోనున్న హంతకుడు క్రజ్‌ ఆ మొత్తాన్ని బోర్గెస్‌కు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. గతంలో ఎన్నడూ ఇటువంటి సెటిల్‌మెంట్‌ చూడలేదని, నిజంగా ఇది ఊహించనిదని బాధితుల తరఫు న్యాయవాది స్కాట్‌ హెర్న్‌డోన్‌ పేర్కొన్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకు 26 మిలియన్‌ డాలర్లను పాఠశాల యాజమాన్యం అందజేయగా, అందులో బోర్గెస్‌కు 1.25 మిలియన్ డాలర్లు లభించాయి. ఈ దుర్ఘటనను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఎఫ్‌బీఐ కూడా అతడికి కొంత పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పలు కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on