Musk mom garage: గ్యారేజ్‌లో నిద్రించిన కోటీశ్వరుడి తల్లి ..! ఫ్యాక్టరీ సైట్‌ వద్ద ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన లేదు..

Updated on: Sep 02, 2022 | 8:34 PM

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్‌ మస్క్‌ తల్లి , 74 ఏళ్ళ మే మస్క్‌ , కుమారుడి ఇంట్లో గ్యారేజీలో నిద్రిస్తానని కుండబద్ధలు కొట్టారు. ఈ విషయాన్ని ఆమె ‘ద సండే టైమ్స్‌’ పత్రికతో పంచుకున్నారు.


టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్‌ మస్క్‌ తల్లి , 74 ఏళ్ళ మే మస్క్‌ , కుమారుడి ఇంట్లో గ్యారేజీలో నిద్రిస్తానని కుండబద్ధలు కొట్టారు. ఈ విషయాన్ని ఆమె ‘ద సండే టైమ్స్‌’ పత్రికతో పంచుకున్నారు. కుమారుడు ఎలాన్‌ మస్క్‌ను కలిసేందుకు స్పేస్‌ ఎక్స్‌ ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికాలోని టెక్సాస్‌కు వెళ్ళిన సమయంలో , అక్కడికి సమీపంలోని ఇల్లేమీ లేదని, అందుకే గ్యారేజీలో నిద్రించానని తెలిపారు. మస్క్‌కు ఆస్తులు కూడబెట్టాలని కానీ, ఫ్యాక్టరీ సైట్‌ వద్ద ఖరీదైన ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదని స్పష్టం చేశారు. అంగారక గ్రహంపైకి వెళ్లాలన్న కోరిక తనకు లేదని పేర్కొన్నారు. తనకు సొంత ఇల్లు లేదని స్నేహితుల ఇళ్లల్లో గడుపుతానని ఎలాన్‌ మస్క్‌ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 02, 2022 08:34 PM