‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే!
ధురంధర్-2 సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్రపై చర్చ జరుగుతోంది. అతను బతికే ఉన్నాడా, లేదా అనేది ప్రశ్న. 1955లో రత్నగిరిలో జన్మించిన దావూద్, సాధారణ కానిస్టేబుల్ కొడుకు నుంచి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా మారాడు. 1993 ముంబై పేలుళ్ల తర్వాత భారత్‌ను విడిచిపెట్టాడు.
ధురంధర్-2 చిత్రంలో దావూద్ ఇబ్రహీం పాత్ర చిత్రీకరణ ప్రేక్షకుల్లో కొత్త చర్చకు తెరలేపింది. సినిమాలో అనారోగ్యంతో ఉన్న దావూద్‌ను చూసిన తర్వాత, అతను నిజంగా బతికే ఉన్నాడా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే, వాస్తవ ప్రపంచంలో దావూద్ ఇబ్రహీం ప్రస్థానం ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు స్థాయి నుంచి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా సాగింది. 1955లో రత్నగిరిలో పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో జన్మించిన దావూద్, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కాదని నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. చదువు మధ్యలోనే ఆపేసి, ముంబై డాన్ హాజీ మస్తాన్ నీడలో అండర్ వరల్డ్ పాఠాలు నేర్చుకున్నాడు. తన సోదరుడు సబీర్ ఇబ్రహీంతో కలిసి డీ-కంపెనీని స్థాపించి, ముంబైని శాసించిన పఠాన్ గ్యాంగ్‌ను అంతం చేశాడు. అతి తక్కువ కాలంలోనే ముంబై అండర్ వరల్డ్‌కు అప్రకటిత రాజుగా అవతరించాడు.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!