Congo Boat Accidents: ఊహించని విషాదం.. 193 మంది జలసమాధి..! పెను విషాదం

Updated on: Sep 14, 2025 | 4:12 PM

కాంగోలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో ఏకంగా 193 మంది మృతి చెందారు. వందలాదిమంది గల్లంతయ్యారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు పడవ ప్రమాదాలు జరగడంతో స్థానికంగా పెను విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాలు మధ్య ఆఫ్రికా దేశమైన వాయవ్య కాంగోలోని ఈక్వెటార్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.

అధికారులు తెలపిన వివరాలు ప్రకారం.. గురువారం సాయంత్రం లుకొలీలా ప్రాంతంలోని కాంగో నదిలో దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పడవ అదుపుతప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 107 మంది మరణించారు. సుమారు 209 మందిని సురక్షితంగా కాపాడినట్లు మానవతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో వెల్లడించింది. కాగా, ఈ సంఘటనకు ఒక రోజు ముందు, బుధవారం బసంకుసు ప్రాంతంలో మరో మోటరైజ్డ్ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మరణించిన 86 మందిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ ప్రమాదంలోనూ పలువురు గల్లంతైనట్లు తెలిసింది. సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ రెండు ప్రమాదాలు జరిగాయి. అధిక బరువు, రాత్రి వేళల్లో ప్రయాణించడం వంటి కారణాల వల్లే బుధవారం నాటి ప్రమాదం జరిగిందని ప్రభుత్వ మీడియా పేర్కొంది. అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానిక పౌర సమాజ సంస్థ ఆరోపించింది. కాంగోలో రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడంతో ప్రజలు చౌకగా ఉండే పడవ ప్రయాణాలపైనే ఆధారపడుతున్నారు. అయితే, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, లైఫ్ జాకెట్లు వంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: పసిడి ప్రియలకు ఊరట.. తులం ఎంతంటే

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు

అల్లు అర్జున్‌ నా డ్రీమ్ హీరో అమ్మో..రితికాది పెద్ద ప్లానింగే

Disha Patani: దిశా ఇంటిపై కాల్పులు జస్ట్ ట్రైలరే అంటున్న గోల్డీ బ్రార్

ఈ రక్త పరీక్షతో.. 10 సం.ల ముందే బయటపడే క్యాన్సర్‌