Cholera in Zambia: జాంబియాలో కలరా కలకలం.! దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో కలరా వ్యాప్తి.
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియా ప్రజలను కలరా కలవరపెడుతోంది. జాంబియా కలరా వ్యాధితో పోరాడుతోంది. 10 వేలమందికి మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. కలరా కారణంగా జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మృతిచెందారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లుసాకాలోని అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు.
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియా ప్రజలను కలరా కలవరపెడుతోంది. జాంబియా కలరా వ్యాధితో పోరాడుతోంది. 10 వేలమందికి మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. కలరా కారణంగా జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మృతిచెందారు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లుసాకాలోని అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు. మరోవైపు జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అలాగే దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాలలో రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది. జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం.. జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మృతిచెందారు. అలాగే 10,413 కలరా కేసులు నమోదయ్యాయి. దేశంలోని 10 రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు కలరా బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400కు పైగా కలరా కేసులు నమోదవుతున్నాయి. కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది. గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వేలో కూడా కలరా వ్యాపించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos