Vaccine In China: చైనాలో మూడేళ్ల చిన్నారులకు కరోనా టీకా.. మళ్ళీ కేసులు పెరగడంతో సర్కార్ నిర్ణయం..(వీడియో)

|

Oct 31, 2021 | 9:08 PM

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చైనా తర్వాత 100 కోట్ల డోసుల మార్కును దాటిన రెండోదేశంగా భారత్‌ రికార్డు నెలకొల్పింది.


ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చైనా తర్వాత 100 కోట్ల డోసుల మార్కును దాటిన రెండోదేశంగా భారత్‌ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో చైనా మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మూడొంతుల మందికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన చైనా ప్రభుత్వం.. కనీసం అయిదు ప్రావిన్సుల్లో 3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. చైనాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగుచూస్తుండటంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్‌ ప్రావిన్స్‌ల యంత్రాంగాలు త్వరలో చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపడుతున్నాయి. ఇందుకోసం దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్‌ టీకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ వ్యాక్సిన్లను చిలీ, అర్జెంటీనా, కాంబోడియా ప్రభుత్వాలు తమ దేశాల్లోని చిన్నారులకు ఇవ్వడం ప్రారంభించాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా 140 కోట్లున్న చైనా జనాభాలో 100 కోట్ల మందికి పైగా దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్‌ టీకాలను పంపిణీ చేసింది. ఈ రెండు టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ విషయంలో స్పష్టత రాలేదు. కానీ చైనా మాత్రం డెల్టా వేరియంట్‌ నుంచి కూడా సినోఫాం, సినోవాక్‌ రక్షణ కల్పిస్తున్నాయని చెబుతోంది.

మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..

RRR Movie- S.S Rajamouli: కాంప్రమైజ్‌ కానంటున్న జక్కన్న.. ఆందోళనలో మేకర్స్‌.. ఆర్ఆర్ఆర్ పై మరో అప్డేట్..(వీడియో)

Follow us on