Pakistani Terrorist: పట్టుబడిన పాక్‌ ఉగ్రవాది.. టెర్రరిస్ట్‌ల ట్రైనింగ్‌ ఆసక్తి విషయాలు వెల్లడి..!(వీడియో)

|

Oct 03, 2021 | 9:05 PM

భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తోంది పాక్‌. దేశంలో చొరబాట్లకు టెర్రరిస్టులను ఎగదోస్తోంది. కానీ ఎప్పటికప్పుడు పాక్‌ కుట్రలను భగ్నం చేస్తోంది ఇండియన్‌ ఆర్మీ. అయితే తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుకున్నారు. అయితే ఆ టెర్రరిస్టు...

భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తోంది పాక్‌. దేశంలో చొరబాట్లకు టెర్రరిస్టులను ఎగదోస్తోంది. కానీ ఎప్పటికప్పుడు పాక్‌ కుట్రలను భగ్నం చేస్తోంది ఇండియన్‌ ఆర్మీ. అయితే తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుకున్నారు. అయితే ఆ టెర్రరిస్టు చేసిన సంచలన కామెంట్స్‌ షాకింగ్‌కు గురి చేసింది. తనకు పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చినట్లుగా వెల్లడించాడు.

ఉరి సెక్టార్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంది భారత ఆర్మీ. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. అయితే అంతకుముందు 2008లో ముంబై ఉగ్రదాడిలో కసబ్‌ను సజీవంగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత బాబర్‌ పాత్ర అనే టెర్రరిస్ట్‌ భారత భూభాగంలో చొరబడుతూ ఆర్మీకి చిక్కాడు. 19 ఏళ్ల అలీ బాబర్ టెర్రరిస్ట్‌ తాను లొంగిపోతానని.. కాల్చి చంపవద్దని ఆర్మీని వేడుకున్నాడు.అలీ పాకిస్తాన్‌లోని ఒకారా పంజాబ్‌లోని దిలాపూర్ జిల్లా నివాసి. అయితే అలీ బాబర్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సభ్యుడిగా గుర్తించారు. పాకిస్తాన్‌లో దాదాపు మూడు నెలల తీవ్రవాద శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు అలీ.

పాకిస్తాన్ కుట్ర రహస్యాన్ని బహిర్గతం చేశాడు అలీ. ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్ తొమ్మిది రోజులు కొనసాగింది. 18 సెప్టెంబర్ లో నియంత్రణ రేఖపై చొరబాటు ప్రయత్నం ప్రారంభమైనప్పుడు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నారు, నలుగురు తిరిగి పాక్‌కు పారిపోయారు. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు సెప్టెంబర్ 25 న డ్రెయిన్‌లో దాక్కున్నారు. 26న ఒక ఉగ్రవాదిని కాల్చి చంపారని తెలిపాడు అలీ.పేదరికం నుండి తప్పించుకోవడానికి అలీ ఏడవ తరగతి తర్వాత చదువు మానేసిన్నట్లు తెలిపాడు. అయితే 2019 లో గర్హీ హబీబుల్లా క్యాంప్‌లో మూడు వారాల శిక్షణ తీసుకుని, ఆ తర్వాత 2021లో మరోసారి పూర్తి శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించాడు. అక్కడి నుంచి అతనికి శారీరక, ఆయుధ శిక్షణ ఇవ్వబడిందని.. అదే సమయంలో శిక్షణ ఇచ్చిన చాలా మంది శిక్షకులు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు ఉన్నారని తెలిపాడు అలీ. తన తల్లి చికిత్స కోసం అతీక్ ఉర్ రెహ్మాన్ అనే వ్యక్తి తనకు 20వేలు ఇచ్చాడని.. ఆమెకు అదనంగా 30 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడని అలీ బాబర్ తాజా ప్రకటనలో వెల్లడించాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Crow Attack on Drone Viral Video: డ్రోన్‌ పై దాడిచేసిన కాకి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..

 CM Charanjit Singh Video: పిలవని పెళ్ళికి వెళ్లిన సీఎం…షాక్‌ అయిన వధూవరులు..! వైరల్ అవుతున్న వీడియో..

 Viral Video: ఏబీ డెవిలియర్స్‌ వికెట్‌ పడగానే అతడి కొడుకుకు కోపం ఏరేంజ్‌ వచ్చిదంటే..! వైరల్ అవుతున్న వీడియో.