స్పేస్ వాక్ చేసిన బిలియనీర్.. ఒకప్పుడు స్కూల్ డ్రాపౌట్
ఇటీవల స్పేస్‌ఎక్స్ ఆధ్వర్యంలో బిలియనీర్ జేరడ్ ఇస్సాక్‌మన్ బృందం అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసింది. ఐదు రోజులపాటు స్పేస్‌లో గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. అయితే జేరడ్ ఇస్సాక్‌మన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాపారవేత్తగా రాణించాలనే ఇష్టంతో తాను పాఠశాల విద్యను మధ్యలోనే మానేశానని తెలిపారు. ఇస్సాక్‌మన్ చిన్ననాటి నుంచే వ్యాపారిగా ఎదగాలని కలలు కనేవాడు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనే ఆసక్తితో 16వ ఏటనే చదువుకు స్వస్తి పలికాడు.
ఇటీవల స్పేస్‌ఎక్స్ ఆధ్వర్యంలో బిలియనీర్ జేరడ్ ఇస్సాక్‌మన్ బృందం అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసింది. ఐదు రోజులపాటు స్పేస్‌లో గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. అయితే జేరడ్ ఇస్సాక్‌మన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాపారవేత్తగా రాణించాలనే ఇష్టంతో తాను పాఠశాల విద్యను మధ్యలోనే మానేశానని తెలిపారు. ఇస్సాక్‌మన్ చిన్ననాటి నుంచే వ్యాపారిగా ఎదగాలని కలలు కనేవాడు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనే ఆసక్తితో 16వ ఏటనే చదువుకు స్వస్తి పలికాడు. పెట్టుబడికి కావల్సిన $10,000 డాలర్లను తన తాత నుంచి తీసుకొని తమ నివాసంలోని చిన్న సెల్లార్‌లో Shift4 Payments అనే స్టార్టప్‌ను స్థాపించాడు. అయితే ప్రారంభంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నా క్రమంగా అగ్ర వ్యాపారసంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీలో దాదాపు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీని మార్కెట్ విలువ 7.4 బిలియన్ డాలర్లు. సంస్థను స్థాపించినప్పుడే అది త్వరలోనే బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా మారుతుందని నమ్మకం ఉండేదని, అందుకోసం తాను, తన స్నేహితుడు తీవ్రంగా శ్రమించామని ఇస్సాక్‌మన్ అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లోకి దూసుకొస్తున్న పాము.. చెప్పు విసిరిన యజమాని.. ఆ తర్వాత ??