Rishi Sunak: అప్పట్లో నన్నూ అవమానించారు.. జాతి వివక్ష ఎదుర్కొన్నా.. కానీ రిషి సునాక్‌.

|

Dec 09, 2022 | 7:59 PM

బ్రిటన్‌లో ఓ నల్లజాతి సంతతికి చెందిన మహిళపై రాజభవనంలోని సీనియర్‌ సిబ్బంది జాతి వివక్ష చూపించారన్న విషయం దుమారం రేపింది. దీంతో వివాదానికి కారణమైన ప్యాలెస్‌ సిబ్బంది


బ్రిటన్‌లో ఓ నల్లజాతి సంతతికి చెందిన మహిళపై రాజభవనంలోని సీనియర్‌ సిబ్బంది జాతి వివక్ష చూపించారన్న విషయం దుమారం రేపింది. దీంతో వివాదానికి కారణమైన ప్యాలెస్‌ సిబ్బంది ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. తాజాగా వీటిపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. ఈ వివాదంపై తాను వ్యాఖ్యానించడం సరైంది కాదన్న ఆయన.. తన జీవితంలోనూ జాత్యాహంకారాన్ని ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ, నేడు అలాంటివి జరుగుతాయని తాను నమ్మడం లేదన్నారు. అలాంటివి ఎప్పుడు కనిపించినా దీటుగా ఎదుర్కోవాలన్నారు. మునుపటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని సూచించారు.బ్రిటన్‌ రాజవంశం నివాసముండే బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో ఇటీవల ఈ జాతి వివక్ష ఆరోపణలు వచ్చాయి. బ్రిటిష్‌ ఛారిటీకి చెందిన నగోజీ ఫులాని అనే మహిళను ఏ దేశానికి చెందిన వారు, ఎక్కడి నుంచి వచ్చావ్‌ అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రిన్స్‌ విలియమ్‌ గాడ్‌మదర్‌ సుసాన్‌ హుస్సే పదే పదే ప్రయత్నించారన్నది ఆరోపణ. అలా విచారించడం తనకెంతో అవమానంగా అనిపించిందని ఫులాని వెల్లడించడంతో వివాదం బయటకు వచ్చింది. దీంతో ప్యాలెస్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన సుసాన్‌ హుస్సే.. ఆ ఘటనపై క్షమాపణలు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..