అమెరికా షట్‌డౌన్‌.. అప్పుడూ ట్రంప్ హయాంలోనే

Updated on: Oct 02, 2025 | 2:44 PM

అమెరికాలో రాజకీయ ప్రతిష్ఠంభన తీవ్ర స్థాయికి చేరడంతో ఫెడరల్ ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్‌లోకి వెళ్లింది. ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన నిధుల బిల్లుపై అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు కీలక ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఆరేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం తొలిసారి షట్‌డౌన్‌లోకి వెళ్లింది.

కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. మంగళవారం అర్ధరాత్రి గడువుకు ముందే రెండు నిధుల బిల్లులను సెనెట్‌ ఆమోదించకపోవడంతో బుధవారం ప్రారంభం నుంచి అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. సెనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన వ్యయ బిల్లును డెమోక్రాట్లు మంగళవారం నాడు అడ్డుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమోదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్”లో ఆరోగ్య సంరక్షణకు విధించిన కోతలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, డెమోక్రాట్ల డిమాండ్లకు అంగీకరించేది లేదని రిపబ్లికన్లు స్పష్టం చేశారు. నవంబర్ 21 వరకు తాత్కాలికంగా నిధులు మంజూరు చేస్తామన్న వారి ప్రతిపాదనను కూడా డెమోక్రాట్లు తిరస్కరించారు. ఫండింగ్ బిల్లు ఆమోదం పొందాలంటే సెనేట్‌లో 60 ఓట్లు అవసరం కాగా, రిపబ్లికన్లకు ఏడు ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం డెమోక్రాటిక్ నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, వారు ఏమాత్రం పట్టు సడలించలేదని విమర్శించారు. అనంతరం, ప్రతిపక్ష నేతలైన హకీమ్ జెఫ్రీస్, చక్ షుమర్‌లను ఎగతాళి చేస్తూ ఒక ఏఐ-జనరేటెడ్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “షట్‌డౌన్ విధిస్తే ఉద్యోగులను తొలగించాల్సి వస్తుంది. చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు. సెలవుల్లో పనిచేయించకున్నా పాత వేతనాలను మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేషనల్ సర్వీస్ పార్కులు మూతబడ్డాయి. ఈ ప్రభావం ఫలితం వెంటనే చూపకపోయినప్పటికీ దీర్ఘకాలం షట్ డౌన్ కొనసాగితే మాత్రం అమెరికా ఆర్థికాభివృద్ధి మందగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా సరిహద్దు భద్రత, శాంతిభద్రతలు, ఎయిర్-ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర సేవలు కొనసాగనున్నాయి. అయితే ఆహార సహాయ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రీ-స్కూళ్లు, ఆహార తనిఖీలు, నేషనల్ పార్కుల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది. గత ఆరేళ్లలో అమెరికాలో షట్‌డౌన్ ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో ట్రంప్ హయాంలోనే 2018-19లో 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది. అమెరికా చరిత్రలో అదే అత్యంత సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింహాద్రి అప్పన్న ఆయుధాలు చూశారా ?? విశేషంగా ఆయుధ పూజ

అమ్మో.. అల్పపీడనం వారం రోజులు వానలే

Gold Price: దుమ్ము రేపుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే ??