Brain Changes: 16 ఏళ్ల కుర్రాడు 70 ఏళ్ల వృద్ధుడిలా.. ఎందుకలా..? దీనికి కారణం చెప్పిన సైటిస్ట్.. వీడియో.

|

Dec 09, 2022 | 7:29 PM

సాధారణంగా 16 ఏళ్ల వయసులో ఉండే కుర్రాడు తన వయసుకు తగినట్లు కాకుండా ఏడు పదుల వృద్ధుడిలా ప్రవర్తిస్తే ఏమనుకుంటాం? ఉన్నట్టుండి మతిమరుపు రావడం లాంటివి గమనిస్తే ఎలా భావిస్తాం? ఇవన్నీ జరుగుతున్నాయి..


యువత మెదళ్లను ఈ మహమ్మారి భౌతికంగా మార్చేసి.. వాటికి వార్ధక్యాన్ని తెచ్చిపెట్టింది. ఈ విషయం అమెరికా స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తాజాగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఈ వివరాలు ‘బయోలాజికల్‌ సైకియాట్రీ: గ్లోబల్‌ ఓపెన్‌ సైన్స్‌’ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి.కొవిడ్‌ వల్ల యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడిందన్న విషయం గతంలోనే తెలిసినా, మెదళ్లకు భౌతికంగా ఏమైందో ఇంతకుముందు తెలియదని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో స్టాన్‌ఫర్డ్‌ న్యూరో డెవలప్‌మెంట్‌, ఎఫెక్ట్‌ అండ్‌ సైకోపాథాలజీ (స్నాప్‌) ల్యాబ్‌ డైరెక్టర్‌ ఇయాన్‌ గోట్లిబ్‌ తెలిపారు. ‘వయసు పెరిగే కొద్దీ మెదడు నిర్మాణం సహజంగానే మారుతుంది. టీనేజి మొదలైనప్పుడు మెదడులో జ్ఞాపకాలు, భావోద్వేగాలను నియంత్రించే హిప్పోక్యాంపస్‌, ఎమిగ్డలా అనే రెండు ప్రాంతాలు పెరుగుతాయి. అదే సమయంలో కార్యనిర్వాహక సామర్థ్యానికి సంబంధించిన కార్టెక్స్‌లోని కణజాలం సన్నబడుతుంది. కొవిడ్‌కు ముందు, తర్వాత 163 మంది పిల్లల ఎంఆర్‌ఐ స్కాన్లను పరిశీలిస్తే.. కొవిడ్‌ లాక్‌డౌన్ల సమయంలో ఈ వృద్ధి బాగా వేగవంతమైనట్లు తెలిసింది. సాధారణంగా పిల్లలు హింసకు, నిర్లక్ష్యానికి గురైనా, కుటుంబంలో కలతల్లాంటివి ఎదురైనా వాళ్ల మెదడు వయసు పెరుగుతుంది. అలాంటివేమీ లేకుండానే కొవిడ్‌ సమయంలో వాళ్ల శారీరక వయసు కంటే మానసిక వయసు కొన్ని రెట్లు పెరిగిపోయింది. 70-80 ఏళ్ల వయసులో జ్ఞాపకశక్తికి చెందిన సమస్యలు వస్తాయి. కానీ 16 ఏళ్ల వయసులోనే అవి వస్తే..?’ అని ఆయన వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..