మహిళల ఆరోగ్యం.. క్యాన్సర్ నివారణ ఆధునిక చికిత్స
మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ నివారణకు సంబంధించిన ఆధునిక చికిత్సలపై TV9 నిర్వహించిన లైఫ్‌లైన్ ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ దినేష్ రెడ్డి గారు పలు విషయాలు పంచుకున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు గల ప్రధాన కారణాలను విశ్లేషించారు. నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
మహిళల ఆరోగ్య పరిరక్షణ, క్యాన్సర్ నివారణ, ఆధునిక చికిత్సలపై అవగాహన కల్పించేందుకు TV9 ఛానెల్ లైఫ్‌లైన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్ రెడ్డి గారు పాల్గొని రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు గల కారణాలపై వివరణ ఇచ్చారు. రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ఒకటి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు అధికమవడం అని డాక్టర్ దినేష్ రెడ్డి తెలిపారు. దీనిని అన్‌అపోజ్డ్ ఈస్ట్రోజెన్గా పేర్కొంటారు. అలాగే, 30 ఏళ్ల తర్వాత మొదటి గర్భం ధరించడం, పిల్లలకు పాలు పట్టించకపోవడం వంటివి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు
H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్ న్యూస్
మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా
