అతివేగంతో కారు నడిపి మహిళ మరణానికి కారణమైన సీఐ పుత్రరత్నం
హనుమకొండలో దారుణం జరిగింది. అతివేగంతో కారు ఢీ కొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. వేగంగా కారు నడిపి మహిళ ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు ఎక్సైజ్ సీఐ కుమారుడు వంశీ. ఫాతిమానగర్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం దగ్గర జరిగిందీ ఘటన. నిన్న ఓటు వేసి వెళుతున్న కవిత అనే మహిళను అతి వేగంగా వెళ్తూ కారు ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన మహిళ స్పాట్‌లోనే చనిపోయింది.

యాక్సిడెంట్ చేసిన కారు.. శరత్ అనే ఎక్సైజ్ సీఐకి చెందినదిగా గుర్తించారు. సీఐ కొడుకు వంశీభార్గవ్ అతి వేగంతో కారు నడిపి యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటనను పోలీసులు పట్టించుకోకపోవడంతో మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు. కాజీపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
Published on: Dec 01, 2023 04:25 PM