Telangana: కామారెడ్డి జిల్లాలో పెళ్లి రోజున ఓ కుటుంబంలో విషాదం
5 నిమిషాల్లో ఇంటికి చేరి పెళ్లిరోజు వేడుకల్లో పాల్గొనాల్సి ఉండగా మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందడగా, భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. పెళ్లి రోజు సందర్భంగా దంపతులు బైకుపై గుడికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి వస్తుండుగా కారు వీరి బైక్‌ను ఢికొట్టింది.
కామారెడ్డి జిల్లాలో పెళ్లి రోజు నాడు ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. బిక్కనూర్ బైపాస్ రోడ్డు వద్ద బైకును వెనుక నుంచి వేగంగా కారు ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త స్వామిగౌడ్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్వామి గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. పెళ్లిరోజున సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Published on: Feb 11, 2024 03:37 PM