Loading video

ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??

|

Mar 24, 2025 | 5:29 PM

దేశంలో ఎంతోకాలంగా హాట్‌డిబేట్‌గా ఉన్న అంశం ఆధార్‌ నెంబర్‌కు, ఓటర్‌ కార్డును అనుసంధానం చేయటం. ఈ విషయంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా? బోగస్‌ ఓట్ల భరతం పట్టే సమయం వచ్చిందా? ఓటర్‌ జాబితాలో తప్పులు, అక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే టైమ్‌ దగ్గరపడిందా? ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఓటర్‌ గుర్తింపు కార్డులకు ఇక మీదట ఆధార్‌తోపాటు, మొబైల్‌ నెంబర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియలో తొలి అడుగు పడింది. ఓటర్లను గుర్తించేందుకు ఓటర్ల జాబితాతో ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం- రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. ఇందుకోసం జనన-మరణాల నమోదు సంస్థలతో అనుసంధానం చేసుకోవాలని CEC ఆదేశించింది. బెంగాల్‌ రాష్ట్రం- అక్కడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న పరిస్థితుల్లో- తృణమూల్‌ కాంగ్రెస్‌- ఓటర్ల జాబితాపై ఫోకస్‌ పెట్టింది. డూప్లికేట్‌ EPICల ద్వారా మోసం జరుగుతోందని ఆ పార్టీ ఆరోపించింది. ఆ తర్వాత, CEC నుంచి వచ్చిన ఆదేశాలు కీలకంగా మారాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం ఇప్పటిదాకా ఆ సంస్థ తీసుకున్న వైఖరికి విభిన్నంగా ఉంది. ఇన్నాళ్లు ఓటర్‌ ఐడీ కార్డుకు, ఆధార్‌ లింక్‌ అవసరం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వచ్చింది. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఇదే చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?

నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్