వనంలో నుంచి జనంలోకి వస్తున్న మృగాలు

Updated on: Dec 27, 2025 | 10:15 PM

వన్యప్రాణులు అడవుల నుండి జనంలోకి వస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లమల ప్రాంతంలో పులుల సంచారం, ముఖ్యంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ లో టీ65 పులి హడలెత్తించింది. పార్వతీపురం జిల్లాలో ఏనుగుల గుంపు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

వన్యప్రాణులు అడవుల నుండి జనంలోకి వస్తున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లమల ప్రాంతంలో పులుల సంచారం, పార్వతీపురం జిల్లాలో ఏనుగుల గుంపుల రాక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వారం క్రితం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో టీ65 అనే పులి ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆత్మకూరు డివిజన్‌లోని సంగమేశ్వరం సమీపంలో కనిపించిన ఈ పులి అమ్రాబాద్ వైపు వెళ్ళినట్లు అటవీ అధికారులు అంచనా వేశారు. పులి జాడ కనిపించకపోవడంతో ఏపీ, తెలంగాణ అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. పర్యాటకులు, మత్స్యకారులు, కృష్ణాతీర ప్రాంత ప్రజలు రాత్రివేళల్లో ప్రయాణించవద్దని, అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట